Advertisement
Google Ads BL

కార్తీ ఖైదీ.. ఈ సారి మనవాళ్ళు కూడా..!


తమిళ హీరో కార్తీ తెలుగు వారందరికీ పరిచయమే. కార్తీ సినిమాలన్నీ తెలుగులోనూ అనువాదం అవుతుంటాయి. అయితే గత ఏడాది దీపావళి కానుకగా రిలీజైన ఖైదీ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. లోకేష కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ లేదు. పాటలు కూడా లేవు. కేవలం కథని నమ్ముకుని తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి అజయ్ దేవగణ్ ముందుకు వచ్చాడు.

Advertisement
CJ Advs

ఖైదీ సినిమా రిలీజ్ అయినపుడే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ ఇప్పుడప్పుడే పట్టాలెక్కక పోయినప్పటికీ తాజాగా ఈ సినిమా నుండి ఒకానొక అప్డేట్ బయటకి వచ్చింది. ఖైదీ సినిమాలో తెలుగు యాక్టర్లు ఎవరూ లేరు. అయినా కూడా తెలుగులో మంచి విజయం అందుకుంది. అయితే ఖైదీ సీక్వెల్ లో తెలుగు యాక్టర్లని తీసుకోవాలని చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర చేయడానికా అన్నట్టు హీరోయిన్ తో పాటు తెలుగు నటీనటులని తీసుకోవాలని అనుకుంటున్నారట. మరి ఖైదీ సీక్వెల్ లో నటించే ఆ తెలుగు యాక్టర్లు ఎవరో చూడాలి.

Telugu actors in Karthi Khaidi..:

Telugu actors in Karthi Khaidi..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs