Advertisement
Google Ads BL

సమంత నవ్వుకు కారణమిదే..!


నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తే ఒకలా.. కమర్షియల్ చిత్రాలు చేస్తే ఒకలా పేరు వస్తుంది అని నేనెప్పుడూ అనుకోలేదంటుంది అక్కినేని కోడలు సమంత. కరోనా లాక్ డౌన్ తో మిద్దె మీద కూరగాయలు పండిస్తున్న సమంత కరోనాకి భయపడకండి అని చెబుతుంది. అలాగే మీకు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలంటే ఇష్టమా? లేదంటే కమర్షియల్ మూవీస్ అన్నా అందులోని పాత్రలన్నా ఇష్టమా అని అడిగితే.. నటన ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తే ఒకలాగా.. కమర్షియల్ చిత్రాలు చేస్తే ఒకలాంటి పేరొస్తుంది అనే ఆలోచనల తనకెప్పుడు లేదంటుంది సమంత. అసలు అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. నటిని కావాలని అనుకోలేదు. కానీ హీరోయిన్ అయ్యాక నటన అంటే ఇష్టం, ప్రేమ రెండు పెరిగాయి అంటుంది సమంత.

Advertisement
CJ Advs

అందుకే నటిగా అది ఇది అని పాత్రలను లెక్కగట్టి ఏరుకోకుండా నాకు వచ్చిన ప్రతి పాత్రలను ఒప్పుకుంటూ వచ్చాను. అలాగే అది ఇది అని కాకుండా అన్ని పాత్రల్లో నేను నటించాలని చాలా బలంగా కోరుకుంటాను. రంగస్థలం, సూపర్ డీలక్స్, ఓ బేబీ, మహానటి చిత్రాలు అందులోని పాత్రలు నా సంకల్పానికి ఉదాహరణలు. నేను కెరీర్ వదిలేసేటప్పటికీ.. అయ్యో ఇలాంటి పాత్రలు చెయ్యలేకపోయానే.. ఇలాంటి పాత్రల్లో నటించలేకపోయానే అనే అసంతృప్తి కలగకూడదనుకుంటాను.. మంచి పాత్రలైతే ఆర్ట్ చిత్రాలైన నాకు ఓకే... కానీ నేను ఒప్పుకునే పాత్రలు చెయ్యడానికి నా శరీరం కూడా సహకరించాలి కదా అంటూ నవ్వేస్తుంది సమంత.

Samantha Akkineni chit chat highlights :

Samantha Akkineni chit chat with Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs