Advertisement
Google Ads BL

ఆసక్తికర విషయం చెప్పిన సాయిధరమ్ తేజ్!


కరోనా లేకపోతే ఈపాటికి సోలో బ్రతుకే సో బెటరు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసేవాడే సాయి ధరమ్ తేజ్. ప్రతిరోజూ పండగే తర్వాత సోలో బ్రతుకే సో బెటరు సినిమా చేసిన సాయి ధరమ్ తేజ్ ఫ్రెండ్ షిప్‌డే సందర్భంగా చెప్పిన ముచ్చట్లివే. సీనియర్ నరేష్ కొడుకు సాయి ధరమ్ తేజ్‌కి బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతున్నాడు. ఇంటర్ చదివే రోజుల నుండి నలుగురైదుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారని.. ఇప్పటికి ఆ ఫ్రెండ్ షిప్ అలాగే కొనసాగుతుంది అని చెబుతున్న సాయి ధరమ్ తేజ్.. కాలేజ్ రోజుల్లో తన ఫ్రెండ్ తాను ఒకే అమ్మాయితో పరిచయం పెంచుకుని ఒకరికి తెలియకుండా మరొకరు ఆ అమ్మాయిని ప్రేమించామని.. కానీ కొన్నాళ్ళకి ఆ అమ్మాయి తమని వదిలి దూరంగా వెళ్లిపోవడంతో ఇద్దరం బాధపడుతుంటే.. నువ్వెందుకు బాధపడుతున్నావ్ అంటే నువ్వెందుకు బాధపడుతున్నావ్ అని అడిగి.. ఇద్దరం ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని పేమించామని పోట్లాడుకున్నాం. కానీ తర్వాత మా స్నేహం మరింతగా పెరిగింది అని చెబుతున్నాడు సాయి ధరమ్ తేజ.

Advertisement
CJ Advs

ఇక వెబ్ సీరీస్ లో అవకాశం వస్తే నటిస్తారా అని అడిగితే.. అందులో నటించాలి, ఇందులో నటించాలి అనేది ఏం లేదని.. కథ బావుంటే వెబ్ సీరీస్ అయినా చేస్తానని.. నాకు కథే ముఖ్యం.. నేను చేసిన కథతో ప్రేక్షకులు తృప్తిగా ఉన్నారా లేదా... అనేది మాత్రమే నాకు కావాలని చెబుతున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇక మీ తమ్ముడు వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమా విడుదలకు ముందు కరోనా లాక్ డౌన్ వచ్చింది విడుదల ఆలస్యం అయ్యింది అని మీ తమ్ముడు ఫీలవుతున్నాడా అని అడిగితే వైష్ణవ తేజ్ చాలా బలంగా ఉంటాడు. మరో రిలీజ్ డేట్ వస్తుంది కదా అంటాడు. అసలు అన్నా మనిద్దరం నటించిన మొదటి సినిమాలు రెండు ఇలా ఆలస్యం అయ్యాయి అని ఈమధ్యనే నవ్వుకున్నాం. ఇక సోలో బ్రతుకే సో బెటరు సినిమా మరో వారం షూటింగ్ చేస్తే ఫినిష్ అవుతుంది అని సెప్టెంబర్ నుండి షూటింగ్స్ కి వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నాడు సాయి ధరమ్ తేజ్. 

Sai Dharam Tej Friendship Day Special Interview:

Sai Dharam Tej talks about Friendship Day
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs