Advertisement
Google Ads BL

శ్రీదేవి కూతురిపై నెపోటిజం ఎఫెక్ట్..!


శ్రీదేవి కూతురు దఢక్ సినిమాతో బాలీవుడ్‌కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కరణ్ జోహార్ హ్యాండ్స్ నుంచి జాన్వీ కపూర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్‌కి అదే శాపం అయ్యింది. జాన్వీ కపూర్ నటించిన రెండో సినిమాని కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పుడదే జాన్వీ కొంప ముంచెట్లుగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో నెపోటిజంపై రచ్చ మాములుగా లేదు. సుశాంత్ సింగ్ మరణంతో ఆయన అభిమానులు బాలీవుడ్‌లో నెపోటిజంపైన అలాగే సినిమా నేపథ్యం ఉన్న వారసులపై కత్తి కట్టారు. 

Advertisement
CJ Advs

అందులో భాగంగానే కార్గిల్ వార్‌లో ఇండియా తరఫున పోరాడిన లేడీ పైలెట్‌ గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా సినిమాపై సుశాంత్ సింగ్ రాజపుత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమాని బాయ్‌కాట్ చెయ్యాలని అంటున్నారు. తాజాగా విడుదలైన గుంజన్ సక్సేనా ట్రైలర్ చూసిన వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కరణ్ జోహార్‌ని టార్గెట్ చేస్తూ టాలెంట్ లేని స్టార్ కిడ్స్‌ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఇండస్ట్రీని నాశనం చేస్తున్నావ్ అని... కరణ్ నిర్మించిన గుంజన్ సక్సేనా సినిమాను చూడొద్దంటూ.. వెంటనే బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. 

గుంజన్ సక్సేనా ట్రైలర్ చూసి జాన్వీ కపూర్‌ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఫేస్‌లో ఏ చిన్న ఎక్స్‌ప్రెషన్ కూడా లేకుండా ఉన్న జాన్వీ కపూర్ ఈ పాత్రకు అర్హురాలు కాదంటూ జాన్వీని కలిపి ఆడుకుంటున్నారు. రేపు 12న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోయే ఈ సినిమా గనక థియేటర్స్ లో విడుదలై ఉంటే.. ఖచ్చితంగా ఆ సినిమాని చూడకుండా థియేటర్స్ దగ్గర సుశాంత్ సింగ్ రాజపుత్ అభిమానులు ధర్నా చేసేవారే. కానీ ఆ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన.. ఆ సినిమాని వీక్షించే వారు తక్కువ ఉంటే గనక నిజంగా కరణ్ కి జాన్వికి అది పెద్ద దెబ్బె అని చెప్పాలి. 

Star Daughter Gets Nepotism Shock:

Nepotism: Netizens Call For Ban On Janhvi Kapoor Gunjan Saxena
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs