Advertisement
Google Ads BL

ప్రభాస్ హీరోయిన్‌కి ఇష్టమైనవి ఇవే..!!


మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో చేసే సినిమా కోసం ఏకంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనేని తీసుకొస్తున్నాడు. ఏం చేసి ఒప్పించాడో కానీ.. ప్రభాస్ సరసన దీపికా అనేది ఫిక్స్ అవడం, ప్రకటన రావడం జరిగిపోయింది. భారీ బడ్జెట్‌తో భారీగా తెరకెక్కబోయే ఈ సినిమాలో దీపికా హీరోయిన్ అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు. సౌత్‌లో ప్రభాస్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న దీపికా పదుకొనే సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. తనకి ఏమేం ఇష్టమో.. తన భర్త రణవీర్ ముచ్చట్లను అభిమానులతో పంచుకుంది. తనకి అమితాబచ్చన్‌తో కలిసి నటించిన పీకూ సినిమాలోని పీకూ పాత్ర అంటే చాలా ఇష్టం అని చెబుతుంది. ఇంకా తనకి ఆవకాయ అంటే మామిడికాయ పచ్చడి, రసం, అన్నం లైఫ్ లాంగ్ తినమన్నా తింటాను అని చెబుతుంది.

Advertisement
CJ Advs

ఇక సౌత్ ఫిల్టర్ కాఫీ, ఛాయ్ అంటే చాలా ఇష్టమని.. తాను చాయ్ బాగా పెడతా అంటుంది. ఇక లాక్ డౌన్ ముగియగానే తన తల్లితండ్రుల వద్దకు వెళతా అని, అమ్మ వండిన ఏ వంట అయినా తనకి చాలా ఇష్టమని చెబుతుంది దీపిక. నాలోని ప్రతిభ, నైపుణ్యం నాకంటే నా సోదరి, నా భర్తకే ఎక్కువ తెలుసు అని చెబుతుంది. ఇక వెకేషన్స్ కి వెళ్లడం అన్నా, పర్వత ప్రాంతాల కన్నా బీచ్ లకి వెళ్లడం చాలా ఇష్టమని.. తన భర్త రణవీర్ త్వరగా నిద్ర లేవడని.. తనని లేపడానికి ఇప్పటివరకు 35 వేలసార్లు గడియారాన్ని స్నూజ్ చేసావ్.. రా బ్రేక్ ఫాస్ట్ తిందువు గాని అంటూ పిలుస్తా అని చెబుతుంది.

Prabhas New Heroine chit chat with Fans:

Prabhas Heroine talks about her tastes 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs