Advertisement
Google Ads BL

ఎవ్వరూ కాదని.. లారెన్స్ క్లారిటీ ఇచ్చేశాడు


హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా మాత్రమే రాఘవ లారెన్స్  హైలెట్ అవడం లేదు. అనాధ పిల్లలకి హెల్ప్ చేస్తూ ఓ శరణాలయాన్ని నడిపే రాఘవ లారెన్స్ ని చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి. అయితే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో చంద్రముఖి సీక్వెల్ తెరకెక్కబోతుంది. అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. అదిగో అప్పటినుండి చంద్రముఖి సీక్వెల్ లో జ్యోతిక నటిస్తుంది అని, కాదు.. సిమ్రాన్ అని, తాజాగా చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుంది అని.. కియారా అద్వానీ చంద్రముఖి సీక్వెల్ తోనే తమిళనాట తెరంగేట్రం చెయ్యబోతుంది అంటూ రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి.

Advertisement
CJ Advs

అయితే తాజాగా రాఘవ లారెన్స్ చంద్రముఖి సీక్వెల్ పై వస్తున్న వార్తలకు స్పందించాడు. ప్రస్తుతం చంద్రముఖి సీక్వెల్ కి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అని.. అలాగే చంద్రముఖి సీక్వెల్ లో ఫిమేల్ లీడ్ రోల్ కు సంబంధించి అనేక రూమర్లు వస్తున్నాయని... అందులో జ్యోతిక, సిమ్రాన్, కియరాల్లో చంద్రముఖి రోల్ ఒకరు చేస్తారని ప్రచారం జరుగుతోందని.... అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని రాఘవ లారెన్స్ కొట్టిపారేశాడు. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక చంద్రముఖి సీక్వెల్ సెట్స్ మీదకెళ్ళడం కానీ, అందులో నటించబోయే హీరోయిన్ ఎవరనేది కానీ తేలుతుంది అని స్పష్టం చేసాడు.

Lawrence Carity about Chandramukhi 2 female Lead:

Raghava Lawrence clarity about Chandramukhi 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs