Advertisement
Google Ads BL

బన్నీ, కొరటాల ఫిల్మ్ హీరోయిన్ ఎవరు?


అల్లు అర్జున్ - కొరటాల కాంబో షురూ అయ్యింది. వారి కాంబో మూవీపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అల్లు రామలింగయ్య వర్థంతి సందర్భంగా అల్లు అర్జున్.. కొరటాల మూవీని ప్రకటించాడు. కొరటాల కూడా మెగా కాంపౌండ్ లోనే మరో మూవీని సైలెంట్ గా అనౌన్స్ చేసాడు. ఆచార్య సినిమా షూటింగ్ వాయిదా పడడంతో ఓ మంచి కథని ప్రిపేర్ చేసి బన్నీకి వినిపించి ఓకే చేయించుకున్న కొరటాల శివ అఫీషియల్ గా ప్రకటన కూడా ఇప్పించేసుకున్నాడు. ఆచార్య అవ్వడమే తరువాయి.. బన్నీ మూవీ స్క్రిప్ట్ మీద కూర్చుంటాడట కొరటాల. ఇక బన్నీ - కొరటాల శివ కాంబో మూవీ పోస్టర్ చూస్తుంటే మళ్ళీ కొరటాల సామాజిక అంశాన్ని నెత్తినెట్టుకున్నాడనిపిస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళ కాంబో అలా సెట్ అయ్యిందో లేదో ఇలా హీరోయిన్ పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చాయి.

Advertisement
CJ Advs

కొరటాల శివ తన మొదటి సినిమా మిర్చిలో అనుష్కని, రిచా గంగోపాధ్యాయని తీసుకున్నాడు. ప్రభాస్ కి పర్ఫెక్ట్ జోడి అనుష్క అనేలా ఉంది ఆ సినిమాలో. తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు తీసిన కొరటాల, మహేష్ కోసం శృతి హాసన్‌ని తీసుకున్నాడు. ఇక మూడో సినిమా జనతా గ్యారేజ్‌లో నిత్యామీనన్, సమంతలని తీసుకుని ట్రెడిషనల్, గ్లామర్ కి పెద్ద పీట వేసిన కొరటాల శివ, మహేష్‌తో భరత్ అనే నేను వచ్చేసరికి బాలీవుడ్ భామ కియారా అద్వానీని తీసుకొచ్చాడు. కియారా అద్వానీ అందాలు భరత్ అనే నేనుకి మెయిన్ ఎస్సెట్ అనేలా ఉంది. 

ఇక ఆచార్య కోసం చిరుకి జోడిగా త్రిషని పట్టుకొచ్చిన కొరటాలకి త్రిష షాకిచ్చింది. తర్వాత కొరటాల శివ, చిరు కోసం కాజల్ ని తీసుకొచ్చాడు. మరి కొరటాల శివ ఇప్పుడు అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ భామని తీసుకుంటాడో.. లేదంటే సౌత్ హీరోయిన్ తోనే సరిపెడతాడో చూడాలి. కత్తిలాంటి హీరోయిన్ ని అయితే అల్లు అర్జున్ కోసం కొరటాల శివ తీసుకురావడం పక్కా.. కానీ ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరనేది మెయిన్ సస్పెన్స్.

who is Allu Arjun and Koratala Siva Film Heroine?:

Allu Arjun and Koratala Siva Combo Film announced 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs