Advertisement
Google Ads BL

రానా వదిలిన ఆకాశవాణి ఫస్ట్ లుక్..


ఏయు అండ్ ఐ స్టూడియో బ్యానర్ లో పద్మనాభరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఆకాశవాణి. అశ్విన్ గంగరాజు దర్శకుడిగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఈరోజే విడుదలైంది. రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఆకాశవాణి పేరుతో ఆసక్తికరమైన టైటిల్ తో వస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఊరి మొదట్లో మర్రిచెట్టు ఊడలు వేలాడదీసుకుని ఉంది. ఆ మర్రిచెట్టు కింద మేకల మంద గుంపుగా ఉంది.

Advertisement
CJ Advs

మేకలు కాచుకోవడానికి వచ్చిన వాడు ఆ మర్రిచెట్టుకు ఊగుతూ కనిపిస్తున్నాడు. ఒకపక్క మేకలు కాచేవాడు ఊగుతుంటే మరోపక్క రేడియో ఊడలకి వేలాడుతూ ఉంది. కాలభైరవ అందించిన మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్న ఈ సినిమాకి ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. తమిళ నటుడు సముతిరకని ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ముఖ్య విషయం ఏంటంటే ఆకాశవాణి ఖచ్చితంగా థియేటర్లోనే విడుదల అవుతుందట. ఈ విషయమై దేవుడి మీద ఒట్టు కూడా వేసారు.

 

Click here for motion poster

Rana Daggubati revealed Aakasavani First look..:

Rana Daggubati revealed Aakasavani First look..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs