Advertisement
Google Ads BL

బిగ్‌బాస్ 4కి నాగ్ రెడీ.. స్టిల్ వైరల్..!


బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 పై రకరకాల ఊహాగానాలు, రకరకాల గాసిప్స్.. వెరసి బిగ్‌బాస్ సీజన్ 4కి రంగం సిద్ధం అయ్యింది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 అతి త్వరలోనే స్టార్ మాలో సందడి చేయబోతుంది. బిగ్‌బాస్ సీజన్ 3 లో హోస్ట్ గా తన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాగార్జున సీజన్ 4‌ని కూడా హోస్ట్ చేయబోతున్నారు. కరోనా నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలతో బిగ్‌బాస్ సీజన్ 4కి స్టార్ మా రంగం సిద్ధం చేసింది. అయితే కరోనాతో గత నాలుగు నెలలుగా మేకప్‌లకు దూరంగా ఉన్న నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 యాడ్ షూట్ కోసం మళ్ళీ మేకప్ వేసుకున్నాడు. తాజాగా నాగార్జున బిగ్‌బాస్ ప్రోమో కోసం మేకప్ వేసుకున్నాడు. కరోనాతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ ప్రోమో షూట్‌లో నాగ్ పాల్గొన్నాడు.

Advertisement
CJ Advs

సోగ్గాడే చిన్నినాయనా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సెంథిల్ కుమార్ కెమెరా‌మ్యాన్‌గా తెరకెక్కిన బిగ్‌బాస్ సీజన్ 4 ప్రోమో త్వరలోనే బుల్లితెర మీదకి రాబోతుంది. నాగార్జున మేకప్ వేసుకుని ప్రోమో షూట్ కోసం రెడీ అయిన పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నాగార్జునకి భారీ పారితోషకం ఇచ్చి బిగ్ బాస్ హోస్ట్ గా ఒప్పించిన స్టార్ మా ఈసారి బిగ్‌బాస్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటుంది. షోకి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్ అయ్యింది అని.. 100 రోజుల్ బిగ్ బాస్ ని 50 రోజులకే కుదించిన స్టార్ మా.. వాళ్ళ కోసం కరోనా ఇన్సూరెన్స్ లు చేయించడం దగ్గరనుండి కోవిడ్ 19 పరీక్షలు చేయించేవరకు జాగ్రత్తలు తెలుసుకుంటుంది. ఇక కరోనాతో అసలు బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందో లేదో అనుకుంటున్న తరుణంలో స్టార్ మా అన్నిటిని అధిగమించి బిగ్ బాస్ ప్రోమో వరకు తీసుకొచ్చింది. 

Nagarjuna ready to Bigg Boss season 4:

Nagarjuna still viral at Bigg Boss 4 Promo shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs