Advertisement
Google Ads BL

బుట్టబొమ్మ క్రియేట్ చేసిన మరో రికార్డు..


ఒక సినిమాలోని పాటలన్నింటిలో ఒకటి లేదా రెండు మాత్రమే సూపర్ సక్సెస్ అవుతుంటాయి. సినిమాలోని పాటలన్నీ ఒకే రేంజ్ లో హిట్ కావడం చాలా అరుదు. ఆ అరుదైన విషయం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకి జరిగింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాటలు ఎంత సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. సామజవరగమనా మొదలుకుని రాములో రాములా, బుట్టబొమ్మ, ఓ మై డాడీ, సిత్తరాల సిరపడు మొదలగు అన్ని పాటలు సూపర్ హిట్టే.

Advertisement
CJ Advs

అయితే ఈ పాటలన్నీ ప్రత్యేకమైనవే అయినప్పటికీ బుట్టబొమ్మ పాట ఇంకా స్పెషల్. టిక్ టాక్, డబ్ స్మాష్ వంటి వాటి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. థమన్ సంగీతం, రామజోగయ్య సాహిత్యం ఇంకా అల్లు అర్జున్ డాన్సులు, పూజా గ్లామర్.. ఇవన్నీ కలిసి ఈ పాటని మరో రేంజ్ కి తీసుకెళ్ళాయి. యూట్యూబ్ లో సంచలనం రేపుతున్న ఈ పాట సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ యూట్యూబ్ లో 300మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న ఈ పాట అతి తక్కువ టైమ్ లో ఆ ఫీట్ సాధించిన తెలుగు పాటగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

Buttabomma song created another record..:

Buttabomma song created another record..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs