Advertisement
Google Ads BL

అల్లు అరవింద్‌పై ఆర్జీవీ సెన్సేషనల్ మూవీ!?


వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్‌లోనూ సినిమాలు తీస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని హాట్, ఇంకొన్ని ఫ్రిక్షన్ కథలతో సినిమాలు చేసి చిత్రాలను ఓటీటీలో వదిలాడు. ఇంకా నాలుగైదు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ‘పవర్ స్టార్’ సినిమాతో మెగా ఫ్యామిలీని టచ్ చేసి మెగాభిమానుల నోళ్లలో నానిన ఆర్జీవీ త్వరలోనే యంగ్ హీరో, అర్థాంతరంగా ప్రాణాలు విడిచిన ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తెరకెక్కిస్తారని.. అందులో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉంటుందని.. ఈ మధ్య వార్తలు వినిపించాయి. మెగాభిమానులు తనను టార్గెట్ చేసే కొద్ది మెగా ఫ్యామిలీలో ఆర్జీవీ ఒక్కొక్కర్నిగా టార్గెట్ చేస్తూ వస్తున్నాడనే ఆరోపణలూ వస్తున్నాయి.

Advertisement
CJ Advs

ఇంతకీ ఏంటది..!?

అయితే ఈ బయోపిక్‌ను ఎప్పుడు తెరకెక్కిస్తారనే విషయం క్లారిటీగా తెలియట్లేదు కానీ.. తాజాగా ఓ సెన్సేషనల్ విషయం వెలుగు చూసింది. అదేమిటంటే ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌పై ఓ సినిమా తెరకెక్కించేందుకు ఆర్జీవీ సన్నాహాలు చేస్తున్నారట. ఎందుకంటే మెగా ఫ్యామిలీపై ఏదైనా ట్వీట్ చేసినా.. ఏదైనా సినిమా తీసినా సరే ఆర్జీవీపై విరుచుకుపడేది, తిట్టిపోసేది అరవింద్ మాత్రమే. అంతేకాదు ఈ మధ్య తీసిన పవర్ స్టార్ సినిమాపై కొందరు సన్నిహితులతో ఆర్జీవీ గురించి అల్లు అరవింద్ ఏదేదో మాట్లాడారట. ఈ విషయాలన్నీ ఆయనకు తెలియడంతో అల్లు అరవింద్‌పై ‘బావ రాజ్యం’ అనే సినిమా ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ టైటిల్ వెనుక..!?

‘బావ రాజ్యం’ అనే పేరు పెట్టడం వెనుక పెద్ద కథే ఉందట. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆఖరికి కాంగ్రెస్‌లో పార్టీని కలిపేయాల్సి వచ్చింది. అయితే ఈ కలిపివేసే ప్రక్రియలో మెగా బ్రదర్ నాగబాబు, అల్లు అరవింద్ కీలక పాత్ర పోషించారని వారే పార్టీని సర్వ నాశనం చేశారని.. అంతేకాదు కోట్లాది కోట్లు కాంగ్రెస్ పెద్దల నుంచి నొక్కేశారనే ఆరోపణలు ఈ ఇద్దరి కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే చిరుకు బావ అయిన అరవింద్‌ పార్టీ నాశనం చేశారు గనుక ‘బావ రాజ్యం’ అనే పేరుతో సినిమా తీస్తారట. మొత్తానికి చూస్తే.. మెగా ఫ్యామిలీని వదలేదే లేదన్నట్లుగా ఆర్జీవీ వరుస ప్లాన్‌లు చేస్తున్నారని దీన్ని బట్టి తెలుస్తోంది. దీనిపై టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ హాట్‌గా చర్చ కూడా జరుగుతోందట. ఆర్జీవీ దీనిపై ఎప్పుడు అధికారికంగా ప్రకటన చేస్తారో..? ఇదే నిజమైతే అల్లు అరవింద్ ఎలా రియాక్ట్ అవుతారో..? ఆర్జీవీపై ఈసారి ఎలాంటి సినిమా తీయడానికి మెగా ఫ్యాన్స్ సిద్ధమవుతారో వేచి చూడాల్సిందే.

Ram Gopal Varma Next Targeting Is The Star Producer Allu Arvind!:

Ram Gopal Varma Next Targeting Is The Star Producer Allu Arvind!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs