Advertisement
Google Ads BL

మరో ఉదయ్ కిరణ్ కోసం తేజ వేట!


టాలీవుడ్ డైరెక్టర్ తేజ తన మొదటి సినిమా ‘చిత్రం’కు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఇప్పటికే రెండు చిత్రాలను ప్రకటించిన ఆయన.. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో సీక్వెల్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాడు. సీక్వెల్ అయితే త్వరగా అయిపోతుందని.. పైగా తనకు డైరెక్టర్‌గా లైఫ్ ఇచ్చిన చిత్రమిదని దానికి సీక్వెల్ చేసి మరోసారి తన సత్తా చాటాలని తేజ భావిస్తున్నాడు. అయితే ‘చిత్రం’ హీరో ఉదయ్ కిరణ్ తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. దీంతో ఆయనలా ఉండే మరో ఉదయ్ కిరణ్ ఇందులో నటింపజేయాలని అనుకుంటున్నాడు. అందుకే గత కొన్ని రోజులుగా మరో ఉదయ్ కోసం తేజ వేట సాగిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సినిమాకు సంబంధించి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉండాలని భావిస్తున్నాడట.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. అందుకే మంచి ప్రతిభను కనబర్చే నటుడిని పట్టుకునేందుకు జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు, ఆడిషన్స్ చేస్తున్నాడు తేజ. ఇప్పటికే సినిమాలో పాత్రధారులందర్నీ దాదాపు ఖరారు చేసేసిన ఆయన.. హీరోను పట్టుకోలేకపోతున్నాడు. కాసింత కూడా పోలికలు లేకపోవడమే ఇందుకు కారణమట. మరీ ముఖ్యంగా ఉదయ్ కిరణ్ వంటి ఫిజిక్, బాడీలాంగ్వేజ్ ఉన్న 20 ఏళ్ల లోపు కుర్రాడిని పట్టుకునేందుకు తేజ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలియవచ్చింది. ఇప్పటి వరకూ సెలక్షన్ అయిపోయిన వారికి శిక్షణ కూడా తేజ ఇప్పిస్తున్నట్లు సమాచారం. వెబ్ సిరిస్ కావడంతో కొత్త వారికి ప్రాధన్యత ఇవ్వాలని.. వారిని ఎంకరేజ్ చేస్తే లైఫ్ ఇచ్చినట్లు ఉంటుందని తేజ భావిస్తున్నాడట. మరి తేజ అనుకుంటున్న ఆ మరో ఉదయ్ కిరణ్ ఎక్కడున్నాడో.. ఎప్పుడు తారసపడుతాడో... ఎప్పుడు తేజ చేతికి చిక్కుతాడో తెలియాలంటే కొద్దిరోజులు నిరీక్షణ తప్పదేమో..!.

Teja Searching for another uday kiran!:

Teja Searching for another uday kiran!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs