కరోనా లాక్‌డౌన్ విధించగానే అందరూ సూపర్ మార్కెట్స్‌కి వెళ్లి నెలకి సరిపడా సరుకులు తెచ్చుకుని ఇంట్లో నిల్వ చేసుకున్నారు. అందరూ కరోనా కష్టానికి భయపడిపోయారు. కేవలం సామాన్య మానవులే కాదు.. సెలెబ్రిటీస్ కూడా కరోనా లాక్ డౌన్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియక సతమతమయ్యారు. అలా సతమతమైన వారిలో అక్కినేని కోడలు సమంత కూడా ఉందట. లాక్ డౌన్ అని చెప్పగానే చైతూని తీసుకుని సూపర్ మార్కెట్ కి వెళ్లి సరుకులు తెచ్చేసుకుందట. మేము మాత్రమే కాదు.. మీలో చాలామంది ఇలానే చేసుంటారు. ఇంటికొచ్చాక ఆ సరుకులన్నీ ఎన్ని రోజులు వస్తాయో అని లెక్కబెట్టుకున్నాం. అవన్నీ అయిపోయాక ఏ చెయ్యాలో అనే ఆదుర్ధాతో అందరం భయపడ్డాము. పైగా మీకు మీ సన్నిహితులకు ఆరోగ్యకరమైన ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సమయంలో నేను చాలా గందరగోళానికి గురయ్యా అంటుంది సమంత.
ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉత్తమైన పనిని చెయ్యడానికి ఇష్టపడతారు. దానికి కొదవేం లేదు. వంట చెయ్యడం, డాన్స్ నేర్చుకోవడం, కవిత్వాలు రాయడం వంటివి అందరూ చేస్తారు. కానీ నేను చెయ్యలేను. అయితే అందరూ చేసేదానికి భిన్నంగా ఉండాలని నేను తోట పని ఎంచుకున్నాను. ఈ విపత్కర పరిస్థితులు నాకో పాఠాన్ని నేర్పాయి. ఇప్పటికే తోటపని సంబంధించిన చాలా పోస్ట్ లు సోషల్ మీడియాలో చేశాను. అందుకే సహజసిద్ధంగా అవసరమైన ఆహారాన్ని పండించాలని నిర్ణయించుకుని మిద్దె వ్యవసాయం చేస్తున్న అని చెప్పిన సమంత మీ ఆహారాన్ని మీరే పండించుకోవడం అంటే.. మీ డబ్బుని మీరే ముద్రించుకోవడం లాంటిది అంటూ మిద్దె వ్యవసాయం ప్రాధాన్యతని సమంత ఇలా వివరించింది.