వరుస ఫ్లాపులని ఎదుర్కొన్న బాలయ్య, ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణయింపబడని ఈ చిత్ర టీజర్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో మళ్ళీ మంచి హిట్ పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమా అనంతరం బాలయ్య ఎవరితో సినిమా చేస్తాడనేది ఆసక్తిగా మారింది.
అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య తర్వాతి చిత్రం టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉండనుందట. బాలయ్యతో సినిమా తీయాలని ఉందని ప్రకటించిన అనిల్ రావిపూడి కథ వినిపించాడని టాక్. పటాస్, రాజ ది గ్రేట్, సుప్రీమ్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్లు అందుకున్న అనిల్ రావిపూడి తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేస్తున్నాడని అంటున్నారు.
నిజానికి సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎఫ్ 3 స్క్రిప్టు పనుల్ని పూర్తి చేసాడు. కానీ ఎఫ్ 3 సినిమా పట్టాలెక్కాలంటే చాలా టైమ్ పడుతుంది. అందువల్ల ఎప్పటి నుండో బాలయ్యతో సినిమా తీయాలనుకున్న తన కలని నెరవేర్చుకోవాలని చూస్తున్నాడట. బాలయ్య కూడా అనిల్ రావిపూడికి ఓకే చెప్పాడని సమాచారం. ఈ విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందట. ఇదే నిజమైతే బాలయ్య అభిమానులకి పండగే..!