బిగ్ బాస్ సీజన్ 4 ప్రచారంలోకొచ్చినప్పటినుండి..ఇప్పటి వరకు బిగ్ బాస్‌లో పాల్గొనే కంటెస్టెండ్ వీరే అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో ప్రచారంలోకొస్తున్నాయి. శ్రద్దాదాస్ దగ్గరనుండి హంసానందిని వరకు, సింగర్ సునీత దగ్గర నుండి ఓ బేబీ ఫేమ్ సునయన వరకు పాల్గొనబోతున్నట్టుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అయితే బిగ్ బాస్ ఆగస్ట్ సెకండ్ వీక్ నుంచి స్టార్ మాలో ప్రసారం కావొచ్చు అనే ఊహాగానాల నడుమ.. బిగ్ బాస్ లిస్ట్‌లో ఉన్న పేర్లతో కొంతమంది ఇప్పుడు మేము బిగ్ బాస్‌కి వెళ్లడంలేదు అని, మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు అంటూ రుసరుసలాడుతున్నారు. నిన్నగాక మొన్న శ్రద్దాదాస్ నేను బిగ్ బాస్‌కి వెళ్లడం లేదు.. నన్నెవరూ సంప్రదించలేదు.. మరొక్కసారి నా పేరు ప్రచారంలోకొస్తే... బాగోదంటూ వార్నింగ్ ఇచ్చింది.
తాజాగా ఓ బేబీ ఫేమ్, యూట్యూబ్ స్టార్ సునయన కూడా తనని బిగ్ బాస్‌లోకి రమ్మని ఎవరూ సంప్రదించలేదు.. అలాంటిది నేను భారీ పారితోషకం ఎలా డిమాండ్ చేస్తాను అంటుంది. బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల ఫేమ్ వస్తుందా లేదంటే డబ్బులు వస్తాయా అనేది పక్కనబెట్టి... నాకు మూడున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం నేను వాడి బాగోగులు చూసుకోవాలి. ప్రస్తుతం నా కొడుకే లోకం. అలాంటిది నేను బిగ్ బాస్ కి వెళ్లడం ఏమిటి. అలాగని నేను లక్ష రూపాయలు బిగ్ బాస్ కోసం ఎలా డిమాండ్ చేస్తాను అంటూ బిగ్ బాస్ కి తాను వెళ్ళేది లేనిది క్లారిటీ ఇచ్చింది.