Advertisement
Google Ads BL

సినిమా వాళ్లకి కాస్త మంచి న్యూసే.. కానీ!


ప్రస్తుతం కరోనా విజృంభణతో షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి. ఒకటో అరో షూటింగ్స్ చేస్తున్న సెట్స్ లో సిబ్బందికి పాజిటివ్ రావడంతో.. జరగాల్సిన ఆ చిన్న పాటి షూటింగ్స్ కి కూడా ప్యాకప్ చెప్పెయ్యాల్సి వస్తుంది. ఇక RRR, ఆచార్య, రాధేశ్యామ్, పుష్ప, వకీల్ సాబ్ లాంటి పెద్ద సినిమాల షూటింగ్స్ కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు మొదలు కావని అందరూ ఫిక్స్ అవుతున్నారు. అయితే కరోనా ఉధృతి చూసి థియేటర్స్ కూడా ఇప్పుడే తెరుచుకోవు.. తెరుచుకున్నా థియేటర్స్‌కి ప్రేక్షకులు రారు.. కాబట్టే ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న సినిమాలన్నీ సైలెంట్‌గా ఓటీటీకి అమ్ముడుపోతే బెటర్ అంటూ వార్తలు రావడం.. నాని వి, రామ్ రెడ్, అనుష్క నిశ్శబ్దం, వైష్ణవ తేజ్ ఉప్పెన లాంటి సినిమాలు ఓటిటి ఆఫర్స్‌కి తలొగ్గాల్సిందే అన్నారు. దానితో దసరా సీజన్ కూడా ఖాళీ అనుకున్నారు.

Advertisement
CJ Advs

అయితే కేంద్రం ఇచ్చిన 25 శాతం ఆక్యుపెన్సీ‌తో థియేటర్స్ తెరవొచ్చని.. 3.ఓ మార్గదర్శకాల్లో తెలిపింది. దానితో ఇప్పటికే పూర్తయిన సినిమాల నిర్మాతలకు కాస్త టెన్షన్ తీరింది. సినిమాలు బావుంటే 25 శాతం ఆక్యుపెన్సీ‌తో థియేటర్స్ నడిచినా.. ప్రస్తుతం విడుదలకు ఓ 10 .. 15 సినిమాలుంటాయి.. మళ్ళీ షూటింగ్స్ పూర్తి చేసుకుని మరి కొన్ని సినిమాలు థియేటర్స్ కి వచ్చేటప్పటికీ.. మా సినిమాల డబ్బు మాకు వస్తుంది, హీరోల క్రేజ్ పెరుగుతుంది అని అనుకుంటున్నారట. మరోపక్క దసరా బరిలో దింపితే బావుంటుంది అని కొంతమంది హీరోలు అనుకుంటుంటే.. ప్రస్తుతం లాక్‌డౌన్ సామి.. ఎప్పుడైతే ఏమిటి థియేటర్స్ ఓపెన్ అయినాయి చాలు అంటున్నారట. ఆగష్టు 1 నుండి థియేటర్స్ తెరుచుకుంటే.. ప్రేక్షకులు మెల్లగా సినిమాలకు అలవాటు పడేసరికి దసరా సీజన్ వచ్చేస్తుంది. సో అప్పుడే తమ సినిమాలను విడుదల చేయడానికి హీరోలు ఆలోచిస్తున్నారట. 

Good News to Cine Industries from Central Government :

Central Government gives permission to Theaters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs