Advertisement
Google Ads BL

బిగ్ బాస్‌కి ఫస్ట్ వార్నింగ్ పంపిన బ్యూటీ!


బిగ్ బాస్‌లోకి సెలబ్రిటీస్‌తో పాటుగా.. కామన్ పీపుల్ కూడా అడుగుపెడుతూనే ఉంటారు. బాలీవుడ్, కోలీవుడ్ ఇతర భాషల్లో అయితే పేరున్న సెలబ్రిటీస్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే.. తెలుగులో కాస్త పేరున్న సెలబ్రిటీస్‌కి బిగ్ బాస్ అంటే పెద్దగా ఇష్టముండదు. అవకాశాలు లేని హీరో, హీరోయిన్స్, అలాగే సింగర్స్ ఇలా చాలామంది బిగ్ బాస్ తర్వాత కెరీర్‌లో బిజీ అవుదామని బిగ్ బాస్‌కి వెళ్లాలనుకుంటారు. కొంతమందికి బిగ్ బాస్ తర్వాత కెరీర్ బావుంటే.. కొంతమందికి కెరీర్లో బిగ్ బాస్ ముందు తర్వాత పెద్దగా తేడా ఉండదు. అయితే ఇప్పుడు సీజన్ 4కి టాలీవుడ్‌లో అవకాశాలు లేని హాట్ హీరోయిన్ ఒకరు వెళుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటే ఆమె నేనా బిగ్ బాస్‌కా.. ఆ మాట మళ్లీ ఇంకోసారంటేనా.. అంటూ వార్నింగ్ ఇచ్చేస్తుంది.

Advertisement
CJ Advs

ఆమె ఎవరో కాదు.. ‘మొగుడు’ లాంటి సినిమాలో అందాలు విచ్చలవిడిగా ఆరబోసినా.. కెరీర్‌లో ముందుకెళ్లలేక హాట్ హాట్ ఫోజుల్తో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రద్దా దాస్. ఆమె పేరు బిగ్ బాస్ సీజన్ 4 ప్రచారంలోకి వచ్చినప్పటినుండి బాగా వినిపిస్తోంది. హాట్ హీరోయిన్ శ్రద్దా దాస్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళుతుంది అనే వార్తలపై స్పందిస్తూ.. తాను ఈ సీజన్ 4 లో లేనని.. అసలు బిగ్ బాస్‌లో పాల్గొనాలనే ఆలోచనే తనకి లేదని.. బిగ్ బాస్ లోకి రమ్మని తననెవరూ సంప్రదించలేదని.. నేను బిగ్ బాస్ సీజన్ 4 లోకి వస్తున్నా అనేది అంతా రూమర్ అని... సోషల్లో మీడియా తనపై జరుగుతున్న ప్రచారాన్ని చూసి చూసి చిరాకొచ్చింది అని.. ఇక సహించలేక హెచ్చరిస్తున్నా అని.. ఇదే ఫస్ట్ లాస్ వార్నింగ్..... ఇలా అసత్యాలు ప్రచారం చేయవద్దంటూ బిగ్ బాస్ విషయంలో శ్రద్దా దాస్ ఫైర్ అయ్యింది. 

Heroine first warning to Bigg Boss:

Sharaddha Das Fires on Bigg Boss Rumors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs