Advertisement
Google Ads BL

హమ్మయ్య.. వాళ్ళిద్దరూ కరోనాని జయించారు..


కరోనా మహమ్మారి రోజు రోజుకీ దాని పరిధి పెంచుకుంటూ వెళ్తుంది. నాలుగు నెలలుగా ఈ వైరస్ సృష్టిస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు. ఇంకా ఎంత కాలం ఈ అలజడి ఉంటుందో తెలియదు. ఇప్పటికే ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. దిన దినానికి కరోనా రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనాకి ఎలాంటి తారతమ్యాలు లేవు. నిజమైన సోషలిస్టుగా వ్యవహరిస్తూ అందరి జీవితాలని ఎఫెక్ట్ చేసుకుంటూ పోతుంది.

Advertisement
CJ Advs

కరోనా సోకిన సెలెబ్రిటీలలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, కూడా ఉన్నారు. ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్యకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కొన్ని రోజులుగా వీరందరికీ ట్రీట్ మెంట్ జరుగుతూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఐశ్వర్యా రాయ్, కూతురు ఆరాధ్య కరోనాని జయించారట. నానావతి హాస్పిటల్లో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్న వీరిద్దరికీ టెస్టుల్లో నెగెటివ్ అని తేలిందట. దాంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారట.

ఈ మేరకు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా సమాచారం అందించాడు. అయితే అమితాబ్, అభిషేక్ మాత్రం కరోనాతో ఇంకా పోరాడుతున్నారట. వారిద్దరు కూడా త్వరగా కోలుకోవాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. 

Those are tested corona negative:

Those are tested corona negative
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs