Advertisement
Google Ads BL

‘లూసిఫర్’ రీమేక్: ఈ ట్విస్టేంటి?


చిరంజీవి మలయాళం రీమేక్ లూసిఫర్ రీమేక్ కోసం సాహో డైరెక్టర్ సుజీత్‌ని తీసుకొచ్చి మెగా ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. మెగా ఫ్యాన్స్ సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ ఏంటన్నయ్యా అంటూ కలవరపడ్డారు. అయితే చిరు లాక్‌డౌన్‌లో సుజీత్‌కి ఇచ్చిన సలహాలు సూచనలతో లూసిఫర్ రీమేక్ వెర్షన్ స్క్రిప్ట్‌ని సుజీత్ ఫైనల్ చేశాడని.. చిరు కూడా మెచ్చాడనే అన్నారు. కానీ తర్వాత సుజీత్ నుంచి లూసిఫర్ రీమేక్ చేతులు మారుతున్నట్టుగా ఓ న్యూస్. అలాగే లూసిఫర్ రీమేక్‌ని చిరంజీవి ఆపేశాడని అన్నారు. సుజీత్ చెప్పిన తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ చిరుని తృప్తిపరచని కారణంగా లూసిఫర్ రీమేక్ ఆపేసినట్లుగా వార్తలొచ్చాయి.

Advertisement
CJ Advs

 

అయితే ఈ విషయంలో సుజీత్ కూడా లైట్ తీసుకుని ఇప్పుడు గోపీచంద్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మించే సినిమాకి షిఫ్ట్ అయ్యాడనే టాక్ మొదలయ్యింది. చిరంజీవి లాంటి పెద్ద స్టార్‌తో మనకెందుకులే అనుకున్న సుజీత్ సైలెంట్‌గా గోపీచంద్ సినిమా కోసం వర్క్‌లో పడ్డాడని అంటుంటే.. లూసిఫర్ కోసం మరో డైరెక్టర్ వేటలో మెగా హీరోలున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. మరి సుజీత్‌ని ఆశపెట్టి పని చేయించుకున్నాక అతనికి హ్యాండ్ ఇవ్వడం పాపం అనిపించినా.. స్క్రిప్ట్ పక్కాగా లేకపోతే హీరోలు మాత్రం ఏం చేస్తారు ఇలానే చేస్తారు. అందులో బలయ్యేది ఇలాంటి దర్శకులే అనే కామెంట్స్ వినబడుతున్నాయి.

New Twist in Mega Star Chrianjeevi Lucifer remake:

Sujeeth Out in Lucifer Remake Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs