Advertisement
Google Ads BL

బన్నీ.. చాకులా తయారవుతున్నాడా..?


అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ హిట్ తర్వాత యమా జోరులో ఉన్నాడు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ రావడంతోనే మాములుగా తెరకెక్కాల్సిన పుష్ప కాస్తా పాన్ ఇండియా మూవీ అయ్యి కూర్చుంది. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మరీ రఫ్‌గా లారీ డ్రైవర్ లుక్‌లో ఇరగదీస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ రఫ్ గడ్డం, రఫ్ హెయిర్ స్టయిల్, లుక్ కూడా ఊర మాస్‌గా ఉంటుందనేది పుష్ప లుక్‌లోనే రివీల్ అయ్యింది. పుష్ప కోసం లాంగ్ హెయిర్ స్టయిల్ అండ్ గడ్డంతో అల్లు అర్జున్ కొత్తగా కనిపించాడు. మరి మార్చ్ లో పట్టాలెక్కాల్సిన పుష్ప కరోనా కారణంగా ఆగింది. అయినా అల్లు అర్జున్ పుష్ప లుక్‌లోనే కంటిన్యూ అవుతున్నాడు. అదే లాంగ్ హెయిర్, అదే గడ్డంతో ఉన్నాడు.

Advertisement
CJ Advs

ఇక కరోనా లాక్‌డౌన్ వేళ అల్లు అర్జున్ అందరిలా జిమ్‌లోనో, ఇంట్లోనో వర్కౌట్స్ చెయ్యకుండా... ఏకంగా పబ్లిక్ లో అంటే కేబీఆర్ పార్క్‌లోనో, లేదంటే సిటీ ఔట్ స్కట్స్‌లోనో వాకింగ్, జాగింగ్ చేస్తూ అల్లు అర్జున్ ఏకంగా ఎనిమిది కిలోల బరువు తగ్గాడట. పుష్ప సినిమాలో పుష్పక్ నారాయణ్ పాత్ర కోసమే అల్లు అర్జున్ ఇలా వెయిట్ తగ్గాడని అంటున్నారు. మరి కరోనా ఉధృతి తగ్గగానే సుకుమార్ - అల్లు అర్జున్‌లు శరవేగంగా పుష్ప షూటింగ్ ని మొదలు పెట్టేస్తారు. ఈలోపు అల్లు అర్జున్ మరింతగా బరువు తగ్గి.. చాకులా తయారై.. పుష్ప కోసం మాస్ లుక్‌లోకి మారతాడన్నమాట. 

Allu Arjun weight loss main highlight for his Pushpa:

Allu Arjun workouts for his New Film Pushpa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs