Advertisement
Google Ads BL

సమంతని అలా చూసి తట్టుకోగలరా?


అక్కినేని సమంత ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తోంది. సినిమా షూటింగ్స్ లేవు, మంచి డైట్ కోసం సమంత తన టెర్రస్ మీదే ఆకుకూరలు అవి పండిస్తోంది. అలాగే ఆరోగ్యం కోసం జిమ్, యోగా అంటూ క్షణం తీరిక ఉండడం లేదు. అయితే సమంతకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రతిదీ సోషల్ మీడియా ద్వారా సమంత అభిమానులతో పంచుకుంటుంది. ఇక తనని కామెంట్స్ చేసే వారికీ నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా సమంత నెటిజెన్స్ కి స్ట్రాంగ్ రిప్లై ఇస్తుంది. తాజాగా సమంత క్రేజ్ ఇన్‌స్టాగ్రమ్‌లో భీభత్సంగా ఉంది. అందుకే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సమంత ఏకంగా 11 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. దీంతో సమంత ఖుషీగా అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది. మంచి వాళ్లతో మరింత మంచి ప్రయాణం.. ఎన్నో ఎత్తుపల్లాలు.. మంచీ చెడు... అన్నింటా నా కోసం మీరు వున్నట్టుగానే, మీ కోసం నేను ఉన్నట్టుగా భావిస్తున్నాను... అంటూ ట్వీట్ చేసింది.

Advertisement
CJ Advs

మరి అంత అందమైన అమ్మాయి నెగెటివ్ షెడ్ అంటే అభిమానులు అల్లాడిపోరు. సమంత బాలీవుడ్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేస్తున్నట్టుగా రివీల్ అయినప్పటి నుండి సమంత కేరెక్టర్ మీద రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకొచ్చాయి. అయితే ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ లో సమంత పాక్ ఏజెంట్ గా కనిపించబోతుంది అని.. సమంత తీవ్రవాదిగా కనిపిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పాక్ స్లీపర్ సెల్ గా సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో కనిపించబోతుంది అని ప్రచారం జరుగుతుంటే... అందమైన గ్లామర్ భామ సమంత లాంటి హీరోయిన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న, విలనిజాన్ని పండిస్తే అభిమానులు తట్టుకోలేరేమోగా అంటున్నారు. అందులోనూ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ఫస్ట్ పార్ట్ లో నటించిన ప్రియమణి.. సమంత కేరెక్టర్ గురించి చెప్పకనే చెప్పిన విషయంతో సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ తోనే ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ 2 లో కనిపిస్తుంది అనేది నిర్ధారణ అయినట్లే. 

Samantha plays negative role in Bollywood Web Series :

Superb Following to Samantha in Instagram 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs