Advertisement
Google Ads BL

RRR టెస్ట్ షూట్ అందుకే ఆపేశారంట..!


కరోనా లాక్‌డౌన్‌తో రాజమౌళి కూడా అందరిలాగే RRR సినిమా షూటింగ్ ఆపేసుకుని కూర్చున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటుగా RRR నటులు, టెక్నీకల్ సిబ్బంది మొత్తం ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే కరోనా ఉధృతి పెద్దగా లేని టైంలో ప్రభుత్వ అనుమతుల కోసం రాజమౌళి, చిరు బృందంతో కలిసి కేసీఆర్‌ని కలవడం అలాగే ఏపీ సీఎం జగన్‌ని కలిసి షూటింగ్స్ అనుమతి కోరి.. చివరికి షూటింగ్ అనుమతులు తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వాలు ముందు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ.. టెస్ట్ షూట్ చేసిన తర్వాత షూటింగ్స్ మొదలు పెట్టమని చెప్పగా.. దానికి చిరు, రాజమౌళిని ఎంచుకుని రాజమౌళికి RRR టెస్ట్ షూట్ చేసే బాధ్యతలు అప్పజెప్పాడు. అయితే రాజమౌళి కూడా అందుకు సిద్ధమయ్యాడు. అన్ని రెడీ చేసుకున్నాక జూలై లో టెస్ట్ షూట్ అనగా.. దానిని కూడా రాజమౌళి ఆపేసి ఫామ్ హౌస్‌కి వెళ్లిపోయాడు.

Advertisement
CJ Advs

అయితే RRR టెస్ట్ షూట్ ఎందుకు ఆగిందో ఎవరికి అర్థం కాకపోయినా.. కరోనా ఉధృతి వలనే ఆగింది అని అందరూ ఫిక్స్ అయ్యారు. తాజాగా RRR కెమెరా మ్యాన్ సెంథిల్ కుమార్ కూడా RRR టెస్ట్ షూట్ ఎందుకు ఆగిందో చెబుతున్నాడు. కరోనా స్టార్ట్ అయ్యే టైంకి RRR టీం మొత్తం కరోనా జాగ్రత్తలు పాటించింది అని.. అందరూ మాస్క్ వేసుకుని శానిటైజ్ చేసుకుంటేనే సెట్‌లోకి అనుమతిచ్చే వాళ్ళని, ఇక కరోనా లాక్‌డౌన్ సమయానికి 70 శాతం RRR షూటింగ్ పూర్తయ్యింది అని చెప్పిన సెంథిల్ కుమార్ టెస్ట్ షూట్ ఆగింది కూడా కరోనాకి భయపడే అని చెబుతున్నాడు. అందులోనూ రోజుకి 500 నుండి 600 మందితో షూటింగ్ చేసే మేము కేవలం 40 నుండి 50 మందితో షూటింగ్ చేయడం పెద్ద సవాల్ అని భావించి కూడా షూటింగ్ చెయ్యడానికి రెడీ అయ్యామని.. కానీ కరోనా ఉధృతి వలనే టెస్ట్ షూట్ ఆపాల్సి వచ్చింది అని చెబుతున్నాడు. ఇంకో రెండు మూడు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని ఆయన తెలిపాడు.

Senthil Reveals Reason for RRR Shoot Delay:

Reason for RRR Shoot Delay! Shoot Will Resume from Then!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs