కమెడియన్ గా ఉన్న సునీల్ హీరో అయ్యాడు., హీరోగా చాలా సినిమాలే చేసాడు. ఒకటీ అరా హిట్ అంతే.. మళ్లీ కమెడియన్‌గా మారదామనుకుని స్నేహితుడిని నమ్ముకున్నాడు. కానీ సునీల్‌ని స్నేహితుడే మోసం చేసాడనే టాక్ ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అదీ బెస్ట్ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్. సునీల్‌కి మంచి కేరెక్టర్స్ ఇవ్వలేక చేతులెత్తేస్తున్నాడనే టాక్ వినబడుతుంది. హీరో నుండి కమెడియన్‌గా మారిన సునీల్‌కి త్రివిక్రమ్ అరవింద సమేతలో ఓ మాములు రోల్ ఇచ్చాడు. ఇక అల వైకుంఠపురములో అయితే సునీల్ ఎందుకున్నాడో ఎవరికీ అర్ధమే కాలేదు. మరోపక్క విలనిజం కూడా సునీల్ అంతగా పంచలేకపోతున్నాడు.
త్రివిక్రమ్ చుట్టూ తిరిగినా.. త్రివిక్రమ్ గతంలోలా సునీల్‌కి మంచి పాత్ర సృష్టించలేకపోతున్నాడు. ఇక తాను చెయ్యబోయే ఎన్టీఆర్ సినిమా కూడా కామెడీ కన్నా ఎక్కువగా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో సునీల్‌కి తగిన కేరెక్టర్ త్రివిక్రమ్ ఇవ్వకపోవచ్చని అంటున్నారు. సునీల్ కూడా కేవలం త్రివిక్రమ్‌ని మాత్రమే నమ్ముకోకుండా వేరే అవకాశాలు కోసం ట్రై చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఏది పడితే అది ఒప్పేసుకోకుండా కాస్త ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే ఒప్పుకోవాలని డిసైడ్ అయ్యాడట సునీల్.