Advertisement
Google Ads BL

కొరటాలే స్వచ్ఛందంగా తగ్గించుకున్నాడట!


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే.. కరోనాతో పూర్తి సంక్షోభంలో పడింది. గతంలోలా భారీ బడ్జెట్ చిత్రాలు ఉండేలా కనిపించడం లేదు. హీరోలకు భారీ పారితోషకాలు ఇచ్చేలా లేదు. నిర్మాతలంతా ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారు. కారణం తాము చేసే సినిమాలు చాలా సెట్స్ మీద ఆగిపోవడంతో అప్పుల బాధ పెరిగిపోతుంది. అందుకే సినిమాల బడ్జెట్ లోనే కాదు, హీరోలు, దర్శకులు తమ పారితోషకాలను తగ్గించుకోవాలని రాజమౌళి లాంటి దర్శకులే సూచించారు. కానీ ఏ ఒక్క హీరో ఇంతవరకు ముందుకొచ్చి పారితోషకం తగ్గించుకున్నామని చెప్పలేదు.

Advertisement
CJ Advs

కానీ పరశురామ్, కీర్తి సురేష్ లు తమ పారితోషకాల్లో కొంతమొత్తం తగ్గించుకున్నారనే టాక్ ఉంది. కానీ క్లారిటీ లేదు. అయితే సమాజం గురించి ఆలోచిస్తూ సినిమాలు తియ్యడమే కాకుండా.. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటూ కరోనాపై సమాజానికి అర్ధమయ్యేలా చెబుతున్న కొరటాల శివ ఇప్ప్పుడు తన పారితోషకంలో కోత పెట్టుకున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం చిరుతో కొరటాల ఆచార్య సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆచార్య సినిమాని కొరటాల చాలా ఎక్కువ మొత్తంలోనే పారితోషకం అందుకోబోతున్నాడు. కానీ తాజాగా కొరటాల శివ స్వచ్ఛందంగా తన పారితోషకాన్ని తగ్గించుకున్నాడని తెలుస్తుంది. ముందు అనుకున్న పారితోషకం కన్నా తక్కువ ఇవ్వండి అంటూ కొరటాల ఆచార్య నిర్మాతలైన రామ్ చరణ్ టీంకి చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్ టాక్.

Koratala Siva decided to cut down his remuneration:

Koratala Siva slashes his remuneration for Acharya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs