Advertisement
Google Ads BL

ప్రభాస్‌కి హిట్టు పడితే.. ఇక ఆపలేరు..!


ప్రభాస్‌ని బాహుబలికి ముందు బాలీవుడ్ హీరోలే కాదు... బాలీవుడ్ ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ బాహుబలితో ప్రభాస్ బాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టించాడు. ఇంకా చెప్పాలంటే బాహుబలితో బాలీవుడ్ హీరోలకు దడ పుట్టించాడు. బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రభాస్ సూపర్ హీరో అయ్యాడు. అయితే బాలీవుడ్ హీరోలు ఇప్పటికీ ప్రభాస్ ని స్టార్ హీరో అంటే ఒప్పుకోరు కానీ.. బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ప్రభాస్ ని గుండెల్లో పెట్టుకున్నారు అనడానికి నిదర్శనం సాహో సినిమాని అక్కడ హిట్ చెయ్యడమే. సాహో సినిమా ప్లాప్ అయినా.. బాలీవుడ్‌లో హిట్ అయ్యింది. అప్పుడే ప్రభాస్ స్టామినా ఏంటో తెలిసినా బాలీవుడ్ హీరోలు ఎవరు కిమ్మనలేదు.

Advertisement
CJ Advs

ఇక ప్రభాస్ ఇప్పుడు వరసగా పాన్ ఇండియా మూవీస్ నే చేస్తున్నాడు. బాలీవుడ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ ఎలాంటి కథతో అయినా బాలీవుడ్‌కి చుక్కలు చూపించడానికి రెడీ అయ్యి.. బాలీవుడ్ దర్శకులతో కాకుండా టాలీవుడ్ దర్శకులతోనే పాన్ ఇండియా ఫిలిమ్స్ ని సెట్ చేస్తున్నాడు. రాధాకృష్ణ తో రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ తో దీపికా పదుకొనె లాంటి హీరోయిన్ తో ప్రభాస్ జోడి కడుతున్నాడు. మరి నిన్నటివరకు లైట్ తీసుకున్న బాలీవుడ్ హీరోలు ఇప్పుడైనా ప్రభాస్ ని సీరియస్ గా తీసుకుంటారో లేదో.. చూడాలి. ప్రభాస్ మాత్రం ఇక సౌత్ సినిమాలతో సరిపెట్టుకోకుండా పాన్ ఇండియాతో బాలీవుడ్ ని వణికించే ప్లాన్స్ వేస్తూనే ఉన్నాడు. సాహో లాంటి ప్లాప్ సినిమాతోనే చుక్కలు చూపించిన ప్రభాస్‌కి బాహుబలి అంత విజయం దక్కకపోయినా.. ఓ సూపర్ హిట్ పడిందా బాలీవుడ్‌లో ఇక ప్రభాస్ కి చెక్ పెట్టడం అనేది ఎవరితరం కాదు.

Bollywood fans likes Young Rebel Star Prabhas :

Prabhas Target on Bollywood 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs