కరోనా కారణంగా బిగ్ బాస్ బుల్లితెర మీద సందడి చేస్తుందో లేదో అనే అనుమానాలకు తెర దించుతూ బిగ్ బాస్ లోగో ని లాంచ్ చేసింది స్టార్ మా. నాగార్జునే హోస్ట్ గా 15 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 4 త్వరలోనే మొదలుకాబోతుంది. ఇప్పటికే కరోనాకి సంబందించిన జాగ్రత్తలతో బిగ్ బాస్ హౌస్ సెట్ నిర్మాణం దగ్గరనుండి బిగ్ బాస్ కి కావలసిన టెక్నీషియన్స్ వరకు అన్ని సిద్ధం చేసిన స్టార్ మా ఇప్పుడు కంటెస్టెంట్స్ కి కరోనా టెస్ట్ చేసి 14 రోజులు వాళ్ళ ఆధ్వర్యంలో క్వారంటైన్ లో పెట్టి మరి పాజిటివ్ రానివారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ఏర్పాట్లని బిగ్ బాస్ యాజమాన్యం చేస్తుందనే టాక్ ఉండగా.. ఇప్పుడు బిగ్ బాస్ కి హిట్స్ చెయ్యడానికిగాను నాగార్జున స్టార్ మా కి కొన్ని కండిషన్స్ పెట్టాడని తెలుస్తుంది. నాగార్జున కరోనాకి భయపడి షూటింగ్స్ కి హాజరవడం లేదు కానీ.. బిగ్ బాస్ యాజమాన్యం ఇవ్వబోతున్న భారీ పారితోషకానికి నాగ్ పడిపోయినా.. నాగ్ పెట్టిన కండిషన్స్ కి స్టార్ మా కూడా ఒకే చెప్పేసిందట.
అదేమిటంటే బిగ్ బాస్ ఓపెనింగ్ రోజున కంటెస్టెంట్స్‌తో పాటు డైరెక్ట్ ఇంటారాక్షన్ వద్దని... సోషల్ డిస్టెన్స్ పాటించేలా బిగ్ బాస్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాడట. ఇక బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జున కోసం ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసినట్టు టాక్ ఉంది. నాగార్జున ఇంటి నుంచి సరాసరి ఆ స్పెషల్ రూమ్‌కు వచ్చి షూటింగ్ చేసి వెళ్లిపోయేలా ప్లాన్ చేశారట. అంతేకాదు ముఖ్యంగా నాగార్జున వారంలో ఒకరోజు మాత్రమే షోలో పార్టిసిపేట్ చేస్తాడని.. మిగతా రోజుల్లో కూడా కొంత మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇక బిగ్ బాస్ ఈసారి తక్కువ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని.. కేవలం 60 నుండి 70 రోజుల వరకే ఉండబోతుంది అని.. ఎపిసోడ్స్ తక్కువైన హౌస్లో కావాల్సిన మసాలా ని బిగ్ బాస్ యాజమాన్యం ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు.