Advertisement
Google Ads BL

‘సర్కార్ వారి పాట’కి హైలెట్ అదేనా?


మహేష్ బాబు - పరశురామ్ కాంబోపై చాలా అంచనాలున్నాయి. అందులోని పరశురామ్ బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలు, లోపాల నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమాని తెరకెక్కిస్తున్నాడనే టాక్ ఉంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఓ బ్యాంకు మేనేజర్ కొడుకుగా కనిపించబోతున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ మొదటిసారిగా మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఇప్పటివరకు లేట్ అయ్యింది కానీ... లేదంటే మహేష్ సర్కారు వారి పాట ఈపాటికి పట్టాలెక్కేసేది. ఇక పరశురామ్ కూడా సర్కారు వారి పాట షూటింగ్ మొదలవ్వగానే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి స్క్రిప్ట్ అండ్ అన్ని పనులు చేసుకుని షూటింగ్‌ని పరిగెత్తించే ప్లాన్‌లో ఉన్నాడు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా సర్కారు వారి పాట సినిమాలో హైలెట్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ ప్రచారంలోకొచ్చింది. సర్కారు వారి పాట స్క్రీన్ ప్లే సినిమాకే హైలెట్ గా నిలవనుంది.. హీరో మహేష్ మరియు విలన్ పాత్ర నడుమ సాగే ఛాలెంజింగ్ మైండ్ గేమ్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయని వినికిడి. మరి మహేష్ కి తలపడే విలన్ లిస్ట్ లో హీరోలు ఉపేంద్ర, సుదీప్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తారో కానీ.. మహేష్ తో తలపడబోయే విలన్ కేరెక్టర్ ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ అని తెలుస్తుంది. అందుకే హీరో ఇమేజ్ ఉన్న వారినే విలన్ గా చూపించాలని పరశురామ్ ఫిక్స్ అయ్యాడట.

News in social media about Sarkaru vaari Paata Highlights:

Mahesh Babu and Parasuram Movie sarkaru vaari paata Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs