Advertisement
Google Ads BL

పూరీ ఈ పోరి.. సౌత్‌లో క్లిక్ అవుతుందా..?


టాలీవుడ్ దర్శకుడు చాలామంది బాలీవుడ్ భామలని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. అందులో చాలామంది మళ్లీ తెలుగులో కనిపించలేదు. ముంబై మోడల్స్ ని కూడా తెలుగు సినిమాలకు పరిచయం చేసాడు. కానీ వాళ్ళు పెద్దగా క్లిక్ అయిన దాఖలాలు లేవు. అనుష్క సూపర్ తో పరిచయమై బాహుబలి వరకు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గానే ఉంది. నాగార్జున శివమణి రక్షిత అయితే రెండు మూడు సినిమాలకే దుకాణం సర్దేసింది. ఇక ఏక్ నిరంజన్ కంగనా మళ్లీ తెలుగు వైపు చూడలేదు. అయేషా టకియా, అదా శర్మ అలాగే లోఫర్ లో వరుణ్ తేజ్ దిశా పటాని.. మళ్లీ తెలుగులో కనబడలేదు. అయితే తాజాగా పూరి జగన్నాధ్ తెలుగుకి మరో బాలీవుడ్ భామని పరిచయం చెయ్యబోతున్నాడు. విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ చేస్తున్న పూరి... అనన్య పాండేని హీరోయిన్‌గా సౌత్‌కి పరిచయం చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

 

మరి అనన్య పాండే లేలేత అందాలతో సిల్కి స్కిన్ తో, హాట్ హాట్ అందాలతో అదరగొట్టేస్తుంది. ఒకే దెబ్బకి సౌత్‌లో చాలా భాషలకి పరిచయమవుతున్న అనన్య పాండే ఇప్పుడు సౌత్ మీద కూడా కన్నెసినట్టుగా టాక్. అనన్య పాండే కన్నెయ్యడం కాదు.. ఛార్మి - పూరి లు పూరి కనెక్ట్స్ లో అనన్య తో అగ్రిమెంట్ చేసుకున్నారట. అందులో భాగంగానే.. ఛార్మి టీం అనన్య పాండ్ కి తెలుగులో ఆఫర్స్ తెచ్చే పనిలో పడ్డారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినబడుతుంది. అయితే ఇప్పటికే టాలీవుడ్ లో దర్శకనిర్మాతల నోట్లో అనన్య పాండే పేరు నానడానికి పూరి ఛార్మినే కారణమంటున్నారు. మరి ఈ లేత అందాలు టాలీవుడ్‌కి ఎప్పుడు దిగుమతి అవుతాయో.. అసలు అనన్య పాండే టాలీవుడ్‌లో ఏ మాత్రం క్లిక్ అవుతుందో చూడాలి. 

Puri Heroines in South Cine Industry:

Puri Jagan introduce one more Heroine to Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs