Advertisement
Google Ads BL

అందుకోసమే దీపికా కండీషన్స్ ఒప్పుకున్నారా?


బాలీవుడ్‌లో హీరోలతో సమానమైన క్రేజ్ ఉన్న నటి దీపికా పదుకొనే. అలాంటి దీపికా తెలుగు హీరో పక్కన నటించాలంటే మాములు విషయం కాదు. అసాధ్యం అనుకున్న విషయాన్ని టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ సుసాధ్యం చేసాడు. ప్రభాస్ 21వ సినిమాలో దీపికా పదుకొనేని హీరోయిన్‌గా తీసుకొచ్చి చూపించాడు. అయితే దీపికా పదుకొనే కూడా మాములుగా ప్రభాస్ సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదట. బాలీవుడ్‌లో తనకున్న క్రేజ్ దృష్ట్యా ప్రభాస్ సినిమాలో తనకు ప్రభాస్ తో సమానమైన పాత్ర కావాలని, అలాగే అడిగినంత పారితోషకం ఇవ్వాలని, డిమాండ్ చెయ్యడమే కాదు... సినిమా ప్రమోషన్స్ లోను తనకు ప్రభాస్ తో సరిసమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని నాగ్ అశ్విన్ కి వైజయంతి మూవీస్ కి కండిషన్స్ పెట్టిందట. ఇక కథలో తన పాత్ర నచ్చిన తర్వాతే దీపికా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Advertisement
CJ Advs

కథ ప్రకారం దీపికా ఈ సినిమాలో ప్రొఫెషనల్ డాన్సర్ రోల్ చేస్తుందట. అయితే పాత్ర దృష్ట్యా దీపికా ఈ సినిమాలో అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ ప్రదర్శించాల్సి ఉంటుందట. అందుకే ఏరికోరి ఆమె పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకుని మరీ నాగ్ అశ్విన్ బృందం దీపికను ఎంచుకున్నారని సమాచారం. ఇక దీపికా అడిగిన 30 కోట్లు ఇవ్వడానికే కాదు... ప్రభాస్ తో సమానమైన పాత్ర ఇవ్వడం, ప్రభాస్ తో పాటుగా దీపికా పదుకొనే ని ప్రమోషన్స్ విషయంలోనూ హైలెట్ చేయబోతున్నారట. మరి ఎంతైనా దీపికా పదుకొనే కున్న క్రేజ్ వలెనే నాగ్ అశ్విన్ ఇలా దీపికా కండిషన్స్ కి తల వంచినట్లుగా బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

These are the Deepika Conditions for Prabhas21 Film :

Nag Ashwin agreed Deepika Conditions 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs