Advertisement
Google Ads BL

‘ఛలో’, ‘భీష్మ’.. తర్వాత చరణ్‌తోనే!


రామ్ చరణ్ RRR, ఆచార్య సినిమాల తర్వాత ఏ డైరెక్టర్ తో కమిట్ అవుతాడో.. ఏ డైరెక్టర్ కథ ఓకే చేస్తాడో అనే ఆసక్తి కేవలం మెగా ఫాన్స్ లోనే కాదు.... సాధారణ ప్రేక్షకుడిలోనూ ఉంది. రామ్ చరణ్ ఆలోచనలు ఎవరు క్యాచ్ చేయలేకపోతున్నారు. రామ్ చరణ్ ఆచార్య, RRR తర్వాత నెక్స్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో వంశి పైడిపల్లి, కొత్త దర్శకుడు గోపాల్ కృష్ణ ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ రామ్ చరణ్ ఎవరితోనూ కమిట్ అవలేదు. తనకి కథ చెబుదామని వచ్చిన చాలామంది దర్శకులను తండ్రి చిరుతో సినిమా చేసేందుకు ప్రిఫర్ చేస్తున్నాడు. అయితే తాజాగా రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా గురించిన ఆలోచనలో ఉన్నాడని ఇప్పటికే ఫోన్ లో కథ కూడా విన్నాడనే టాక్ వినబడుతుంది.

Advertisement
CJ Advs

‘ఛలో, భీష్మ’ చిత్రాలతో హిట్ కొట్టిన వెంకీ కుడుములతో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఉండొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భీష్మ హిట్ తర్వాత చిరు వెంకీ కుడుములతో చాలా మంచి సినిమా తీసావ్ అని అభినందించడంతో.. వెంకీ కుడుముల నెక్స్ట్ చిత్రం రామ్ చరణ్ తో ఉండొచ్చుగా అనే టాక్ అప్పట్లోనే అంటే మార్చ్ లో వినబడింది. అయితే తాజాగా వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్‌కి చరణ్ ఇంప్రెస్ అయ్యాడని.. ఫుల్ స్క్రిప్ట్ నేరేషన్ కూడా విని ఓకే చేసాడని అంటున్నారు. ఇంతకుముందు లాక్ డౌన్ లో చాలా కథలు విన్న రామ్ చరణ్ కి ఇప్పుడు వెంకీ చెప్పిన కథ బాగా నచ్చడంతో నెక్స్ట్ మూవీ ఓకే చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Ram Charan Film in Venky Kudumula Direction :

Ram Charan Green Signal to Bheeshma Director 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs