Advertisement
Google Ads BL

కరోనా లాక్‌డౌన్‌కి థ్యాంక్స్ చెప్తున్న స్టార్ హీరోయిన్!


కరోనా లాక్‌డౌన్‌కి అందరూ దణ్ణాలు పెడుతున్నారు. కారణం కొంతమందికి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంటే.. మరికొంతమందికి పని లేక పూట గడవడం లేదు. చాలామంది హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా? ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళ్ళిపోదామా? అని ఎదురు చూస్తున్నారు. మరికొందరు కరోనా తగ్గనివ్వండి వెళదాం అంటున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ మాత్రం కరోనా లాక్‌డౌన్‌కి థాంక్స్ చెబుతుంది. కారణం.. లాక్ డౌన్ కారణంగా తన సొంత ఊరిలో తల్లితండ్రులతో కలిసి ఉన్నందుకు. ఆమె ఎవరో కాదు ‘పుష్ప’ హీరోయిన్ రష్మిక మందన్నా. రష్మిక కరోనా లాక్‌డౌన్ కి థాంక్స్ చెబుతుంది. చిన్నప్పటి నుండి బోర్డింగ్ స్కూల్‌లో చదవడంతో హాస్టల్‌లో ఉండేదట రష్మిక.

Advertisement
CJ Advs

తర్వాత కెరీర్ అంటూ సినిమాల్లో బిజీ అయ్యాక తల్లితండ్రులతో కలిసి ఉండాలని ఉన్నా కుదిరేది కాదట. లాక్ డౌన్ పెట్టగానే హమ్మయ్య నేను అనుకున్నా, కోరుకున్న చిన్న బ్రేక్ దొరికింది అని ఫీల్ అయ్యిందట. కానీ మళ్ళీ లాక్‌డౌన్ పొడిగించేసరికి.. తల్లిదండ్రుల దగ్గరికి కూర్గ్ వెళ్లిపోయిందట రష్మిక. అక్కడ కూర్గ్‌లో తాను చిన్నప్పటి నుండి ఏం మిస్ అయ్యిందో తనకి అర్ధమయిందట. మా ఇంటి కిటికీ దగ్గర నుండి బయటికి చూస్తుంటే.. మంచుతో నిండిన కొండలు.. చుట్టూ సువాసన వెదజల్లే కాఫీ తోటలు.. వావ్.. అద్భుతంగా ఉందిక్కడ అంటుంది రష్మిక. ఈ లాక్‌డౌన్ లో ఆన్ లైన్‌లోనే కథలు వింటుందట రష్మిక. అంతేనా తన స్టాఫ్‌కి తన తండ్రి కంపెనీలో పనిచేసి స్టాఫ్‌కి పనిలేకపోయినా జీతాలిస్తూ వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నా అని చెబుతుంది రష్మిక. ఎంతైనా రష్మికది చాలా పెద్ద మనసు కదా..! 

Heroine Says Thanks to Corona Lockdown:

Rashmika Mandanna Says Thanks to Corona Lock down 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs