Advertisement
Google Ads BL

మహేష్ పుట్టినరోజున వచ్చే సర్ప్రైజ్ ఏంటో..?


సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ చేసే సినిమాపై ఎన్నో ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో పరశురామ్ దర్శకత్వంలో మహేష్ చిత్రం ఉంటుందనే వార్త నిజమైంది. గీత గోవిందం దర్శకుడితో మహేష్ చేస్తున్న చిత్రానికి సర్కారు వారి పాట అనే టైటిల్ ని ప్రకటించారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ కి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ గా కనిపించడమే కాదు మాస్ ప్రేక్షకులకి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయట. బ్యాంకులు.. వాటిల్లో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా సామాజిక సందేశాన్ని ఇచ్చే విధంగా ఉంటుందని వినబడుతుంది. అయితే ఈ సినిమా నుండి మరో అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజుని పురస్కరించుకుని సర్కారు వారి పాట సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని భావిస్తున్నారు. కానీ అలాంటిదేమీ కనిపించడం లేదు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ మొదలెట్టలేదు. కరోనా పూర్తిగా తగ్గాకే సర్కారు వారి పాట సెట్స్ మీదకి వెళ్ళనుంది. అందువల్ల మహేష్ సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ రావని సమాచారం. 

Is there any Surprise form Maheshs Sarkaru Vaari Paata..?:

Is there any Surprise form Maheshs Sarkaru Vaari Paata..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs