Advertisement
Google Ads BL

9 ప్రేమ కథల్ని రెడీ చేస్తున్న సుకుమార్..


టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరోని నెగెటివ్ షేడ్స్ లో చూపించడం సుకుమార్ తోనే మొదలైందని చెప్పవచ్చు. ఆర్య సినిమాతో ప్రేమకథని ఇలా కూడా తీయొచ్చా అని షాక్ అయ్యేలా చేసాడు. సుకుమార్ తీసిన ఫ్లాప్ చిత్రాలకి కూడా ఫ్యన్ బేస్ ఉందంటే, సుకుమార్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సుకుమార్, అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement
CJ Advs

అయితే లాక్డౌన్ కారణంగా పుష్ప షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ ఖాళీ టైమ్ లో సుకుమార్ ఓ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నాడని టాక్. మహమ్మారి కాలంలో సుకుమార్ 9 ప్రేమకథల్ని రెడీ చేసాడట. ఈ 9 ప్రేమకథలో 9మంది హీరోలు కనిపిస్తారట. ఇంకా 9మంది డైరెక్టర్లు ఈ వీటిని తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరమీదకి తీసుకువచ్చే సుకుమార్, 9 ప్రేమకథల్ని తీసుకువస్తున్నాడనే టాపిక్ వైరల్ గా మారింది. మరి ఈ విషయమై మరిన్ని వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడి చేస్తారట. 

Sukumar planning nine love stories:

Sukumar planning nine love stories
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs