టెలివిజన్ లో అత్యంత పాపులారిటీ దక్కించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ పై కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా ప్లానింగ్స్ అన్నీ దెబ్బతినడంతో ఈ సంవత్సరం బిగ్ బాస్ సీజన్ ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు తలెత్తాయి. షూటింగ్స్ లో ఉండే ఇబ్బందులు, రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు, సామాజిక దూరం మొదలగు కారణాల వల్ల బిగ్ బాస్ ఉండదేమో అన్న సందేహాలు వచ్చాయి.
అయితే మరోపక్క బిగ్ బాస్ లో వచ్చే కంటెస్టెంట్ల విషయమై పుకార్లు హల్చల్ చేసాయి. టాలీవుడ్ సెలెబ్రిటీల్లో చాలా మంది పేర్లు కంటెస్టెంట్లుగా వస్తున్నట్టుగా వినబడింది. దీంతో సీజన్ 4పై చాలామందిలో నమ్మకం కలిగింది. అయితే ఆ నమ్మకం నిజమైంది. బిగ్ బాస్ సీజన్ 4 మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవనుంది. ఈ మేరకు స్టార్ మా ట్విట్టర్ ద్వారా వెల్లడి చేసింది. గత మూడేళ్ళుగా తెలుగు ప్రజలని ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్ బాస్ షో నాలుగవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఎప్పుడు మొదలవుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. మరి కంటెస్టెంట్లుగా ఎవరొస్తున్నారో చూడాలి.