Advertisement
Google Ads BL

రష్మిక ఛాలెంజ్‌ను స్వీకరించిన రాశీఖన్నా


‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఇప్పుడు ఈ పేరు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎవరైనా నాకు ఛాలెంజ్ చేస్తే బాగుండు నేను సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావాలి అనే స్థాయికి వెళ్ళింది అనడం అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరికి మొక్కలు నాటి, వాటిని పెంచి, ప్రతి ఒక్కరికి తమ వంతు సామాజిక బాధ్యత నెరవేర్చేలా అవగాహనా కల్పించడమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. భారతదేశ నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, పిల్లలు సైతం మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన టాలీవుడ్ బ్యూటీ రష్మీక మందాన్న ఛాలెంజ్ విసిరారు. రష్మిక ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రముఖ నటి రాశీఖన్నా ఈ రోజు (సోమవారం) Jmr White Lotus - Shaikpet లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

అనంతరం రాశీఖన్నా మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని, పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటే కార్యక్రమము, భవిష్యత్ తరాలకు ఎంతో మేలుచేస్తుంది. అంతేకాదు తన అభిమానులందరూ ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను ముందుకు తీసుకుపోయేలా.. ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చింది. తను మరో ముగ్గురు నటీమణులకు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నాలను ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్‌గారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
CJ Advs

Raashi Khanna Accepts Rashmika Challenge:

Raashi Khanna Participates Green India Challenge
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs