కరోనా ఎప్పుడు పోతుంది.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది.. ఇది ఇప్పుడు సినీ పరిశ్రమ ముందున్న అతి పెద్ద సవాల్. అసలు షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో.. ఎన్నాళ్ళు ఈ పరిస్థితి ఉంటుందో అనేది అర్ధం కావడం లేదు. ఒక్కొక్కరు.. ఇప్పుడు షూటింగ్ చేసేందుకు కూడా సుముఖంగా లేరు. అందులోను పెద్ద సినిమాలన్నీ కరోనా కారణంగా మూలపడ్డాయి. చిరు ఆచార్య కానీ, రాజమౌళి RRR కానీ, ప్రభాస్ రాధేశ్యామ్ కానీ, అల్లు అర్జున్ పుష్ప కానీ.. ఇప్పుడప్పుడే మొదలయ్యే సూచనలు కానీ.. స్పష్టత కానీ కనిపించడం లేదు. జూనియర్ ఆర్టిస్ట్‌లంతా కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడడంతో లబోదిబో అంటున్నారు. చిరు, బాలయ్య, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా పెద్ద స్టార్స్‌కి ఎన్నాళ్ళు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు ఉన్నాయి. కానీ కొంతమందికి షూటింగ్ ఉంటేనే పూట గడుస్తుంది.
కానీ కరోనా ఉదృతి ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేసి పనికానిద్దామన్నా అది ఎంతవరకు కుదురుందో అనే మీమాంశ. 1000 మంది ఉండాల్సిన చోట కేవలం 100 మందితో షూటింగ్ అంటే అయ్యే పని కాదు కాబట్టే రాజమౌళి సైలెంట్ అయ్యి హైదరాబాద్ విడిచి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయాడు. ఇక కొరటాల కానీ, త్రివిక్రమ్ కానీ, సుకుమార్ కానీ, రాధేశ్యామ్ రాధాకృష్ణ కుమార్ కానీ మాట్లాడడం లేదు. ఇక స్టార్ హీరోలు సరేసరి. మరి కరోనా రోజురోజుకి పెరగడమే కానీ.. తరగడం లేదు. మరి ఇలాంటి సమయంలో షూటింగ్స్ అన్ని ఆగష్టు నుండి డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయినా అవ్వవచ్చు. ఎవరైనా ధైర్యం చేసి షూటింగ్స్ తో సెట్స్ మీదకెళితే ఏం జరుగుతుందో అనేది కరోనా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.