Advertisement
Google Ads BL

ఈ భామకి రమ్య నీలాంబరి టైప్ పాత్ర కావాలంట!



రజినీకాంత్ హీరోగా రమ్యకృష్ణ నీలాంబరిగా నెగెటివ్ పాత్రలో తెరకెక్కిన నరసింహ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్. అయితే ఆ సినిమాలో రజినీకాంత్ నటనకు ఎంతగా పేరొచ్చిందో.. అంతకు తగ్గ పేరు నీలాంబరి పాత్రధారి రమ్యకృష్ణకి వచ్చింది. ఆ సినిమా విడుదలైన కొత్తలో రజినీకాంత్ ని డామినేట్ చేసిందని రమ్యకృష్ణపై రజినీకాంత్ అభిమానులు ఆగ్రహం కూడా వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు అలాంటి పాత్ర చేయాలని ఉంది అంటుంది విరాటపర్వం భారతక్క. విరాట పర్వం సినిమాలో మాజీ నక్సలైట్ గా ప్రియమణి నటిస్తుంది. అలాగే నారప్ప లో వెంకటేష్ కి భార్య పాత్రలోనూ నటించడమే కాదు.. డాన్స్ రియాలిటీ షోస్ లో జడ్జ్ గాను ప్రియమణి బిజీ.

అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఇంట్లోనే ఉన్న ప్రియమణి వంట తప్ప అన్ని పనులు చేసిందట. వెబ్ సీరీస్ లు చూడడం, సినిమాలు చూడడమే కాదు.. చాలా కథలు కూడా విందట. అయితే తాను ఒప్పుకున్నా సినిమా షూటింగ్ మొదలయ్యేటప్పుడే వాటి గురించి చెబుతా అంటుంది. ఇక ఫ్యామిలీమెన్ వెబ్ సీరీస్ లో మనోజ్ బాజ్పాయికి భార్యగా నటిస్తున్నా అని చెప్పిన ప్రియమణి, ఆ సీక్వెల్ లో నటిస్తున్న సమంతకి తనకి మధ్యన కాంబో సన్నివేశాలు లేవు కానీ.. సమంత పాత్ర ఈ సీక్వెల్ లో విభిన్నంగా ఉండబోతుంది. అలాగే సమంత కేరెక్టర్ గురించి నేను ఓ లైన్ విన్నాను.. అది అందరికి చాలాబాగా నచ్చుతుంది. అయితే తనకి నరసింహలోని రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర లాంటి నెగెటివ్ పాత్ర చెయ్యాలని ఉందని చెప్పింది. అలాంటి పాత్రే తానుగా అతిధి సినిమాలో చేశా అని.. అతిధి అనే హర్రర్ మూవీ హాలీవుడ్ స్టయిల్లో తెరకెక్కింది. కాకపోతే థియేటర్స్ లో విడుదల కావాల్సిన మూవీ కరోనా తో ఓటిటిలో విడుదలైంది అని చెబుతుంది ప్రియమణి. ఇక తన భర్త రాజ్ తనకి దొరకడం చాలా అదృష్టమని చెప్పిన ప్రియమణి, ముంబై డేట్స్ మొత్తం తన భర్త రాజ్ చూసుకుంటాడని కూడా చెబుతుంది.

Advertisement
CJ Advs

Priyamani wants ramyakrisyna neelambari type character:

Priyamani interest on Ramayakrishna neelambari role
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs