Advertisement
Google Ads BL

అనసూయ ఆ వార్తలు ఖండించింది



జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ నిన్నగాక మొన్న ఛాలెంజింగ్ పాత్రలు కోసం ఎదురు చూస్తున్నా.. ఇప్పటివరకు అలాంటి పాత్రే రాలేదంటూ సంచలనంగా మాట్లాడింది. తాను ఇప్పుడు తెలుగుతో పాటు తమిళనాట కూడా అడుగుపెట్టబోతున్న అని చెప్పిన ఈ హాట్ యాంకర్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరోకి తల్లి పాత్ర చేస్తుంది అని.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. హీరో సుమంత్ అశ్విన్ కు తల్లి పాత్రలో అనసూయ నటిస్తోందనే వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్న హాట్ న్యూస్. ఇంతకీ ఆ న్యూస్ ప్రచారంలోకి రావడానికి ఓ పెద్ద కారణమే ఉంది.

అదేమిటంటే... నాగ్ అశ్విన్ సినిమాలో నాగ్ అశ్విన్ కి తల్లి పాత్రలో ఇంద్రజ నటించాల్సి ఉండగా.. కరోనా లాక్ డౌన్ వలన ఇంద్రజ చెన్నై నుండి హైదరాబాద్ కి రాలేకపోవడంతో.. ఆమె ప్లేస్ లోకి అనసూయకి భారీ పారితోషకం ఇచ్చి మరీ ఒప్పించినట్టుగా టాక్ నడుస్తుంది. అయితే తాను తల్లి పాత్రల్లో కనిపిస్తానని జరుగుతున్న ప్రచారానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టింది. నేను తల్లి పాత్రలోనా.. నో అంటుంది. నేను తల్లిగా నటిస్తున్నా అని వస్తున్న వార్తలో నిజం లేదని.. అసలు కరోనా కారణంగా టీవీ షూటింగులకే తాను హాజరు కావడం లేదని... అలాంటప్పుడు సినిమా షూటింగులకు ఎలా హాజరవుతాను అంటూ ఎదురు ప్రశ్న వేస్తుంది అనసూయ భరద్వాజ్.

Advertisement
CJ Advs

Anchor Anasuya Condemned That Rumor:

Anasuya Clarity about Mother Role in Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs