Advertisement
Google Ads BL

పూరీ శిష్యుడి డైరెక్షన్లో చేస్తున్నా.. హ్యాపీ: విలన్


22 మూవీలో నా క్యారెక్టర్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది - బాలీవుడ్ న‌టుడు విక్రమ్‌జీత్  విర్క్
22 మూవీ ఒక మంచి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. నా క్యారెక్ట‌ర్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. క‌థ విన‌గానే చాలా ఎగ్జ‌యిట్ అయ్యి ఆ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి ఒప్పుకున్నాను. నేను పూరి జ‌గ‌న్నాథ్ గారి హార్ట్ ఎటాక్ సినిమాలో విల‌న్‌గా చేశాను. ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు ఆయ‌న శిష్యుడు శివ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మెయిన్ విల‌న్‌గా చేయ‌డం సంతోషంగా ఉంది. అని అన్నారు బాలివుడ్ న‌టుడు విక్రమ్‌జీత్  విర్క్‌. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందిన‌ చిత్రం 22. ఈ మూవీలో విక్రమ్‌జీత్  విర్క్ ఒక కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. జులై 19 ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా 22 మూవీ నుండి విక్ర‌మ్ స్టైలీష్ లుక్ ని విడుద‌ల‌చేసి శుభాకాంక్ష‌లు తెలిపింది చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. శివ చాలా టాలెంటెడ్ ప‌ర్స‌న్‌. మొద‌టి సినిమా అయినా చ‌క్క‌గా హ్యాండిల్ చేశారు. రూపేష్ మంచి న‌టుడు. త‌న‌కి త‌ప్ప‌కుండా బ్రైట్ ఫ్యూచ‌ర్ ఉంటుంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డిఫ‌రెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా 22 త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది అని అన్నారు. ఈ చిత్రంలోని పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌వుతున్నాయి.

Advertisement
CJ Advs

రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌జీత్  విర్క్‌, దేవిప్రసాద్‌, జయప్రకాష్‌, రవి వర్మ, శశిధర్‌ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్‌, పూజా రామచంద్రన్‌, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్‌ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్‌ తరుణ్‌, మాస్టర్‌ దేవాన్ష్‌, బేబి ఓజల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బి.వి.రవికిరణ్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటింగ్‌: శ్యామ్‌ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్‌: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్‌: జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, సౌండ్ మిక్సింగ్: ఇ. రాధాకృష్ణ‌.ప్రొడక్షన్‌ మేనేజర్‌: కిరణ్‌ కాసా, పిఆర్ఓ: బి.ఎ రాజు, చీఫ్‌ కో-డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్‌ బి.

My Role in 22 Movie Will be very Different says Vikramjeet Virk:

Vikramjeet Virk birthday special Poster from 22 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs