Advertisement
Google Ads BL

తమన్నా డిమాండ్ మామూలుగా లేదు..!


ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ ల పర్వం నడుస్తుంది. ఇతర భాషల్లో హిట్ అనిపించుకున్న చిత్రాల రీమేక్ హక్కులని కొనుక్కునేందుకు తెలుగు నిర్మాతలు ఎగబడుతున్నారు. ఈ వరుసలో ఇప్పటికే చాలా చిత్రాలు రెడీ అవుతున్నాయి. తాజాగా కన్నడ చిత్రమైన లవ్ మాక్ టైల్ తెలుగులోకి రీమేక్ కానుందని ప్రచారం జరిగింది. నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రీమేక్ లో యాక్టర్ సత్యదేవ్ హీరోగా కనిపించనున్నాడట. హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకున్నారని టాక్.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాలో నటించడానికి తమన్నా భారీగా డిమాండ్ చేస్తోందని సమాచారం. డీ గ్లామర్ రోల్ లో కనిపించనున్న తమన్నా ఈ సినిమాకి రెండున్నర కోట్లు డిమాండ్ చేసిందని వినబడుతుంది. కరోనా టైమ్ లో నిర్మాతలకి తలనొప్పి కాకుండా ఉండేందుకు హీరోలు, హీరోయిన్లు తమ తమ రెమ్యునరేషన్లు తగ్గించుకుంటున్నారని వార్తలు వస్తున్న తరుణంలో తమన్నా ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై ఎవరూ స్పందించలేదు. కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా సత్యహెగ్డే పనిచేస్తున్నాడు. కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందట.

Tamannah Demanding huge for remake..:

Tamannah Demanding huge for remake..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs