Advertisement
Google Ads BL

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌లో పాల్గొన్న దిగంగనా!


గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది.

ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రముఖ హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ ముంబైలోని తన నివాసంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని దీనిలోకి తనను ఆహ్వానించిన దర్శకుడు సంపత్ నందికి కృతజ్ఞతలు తెలిపారు. దీనిలో అందరూ పాల్గొని బాధ్యతగా మొక్కలు నాటాలని ట్విట్టర్ ఖాతాలో ఆమె తన అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది.

Advertisement
CJ Advs

Digangana Suryavanshi Participated in Green India Challenge :

Digangana Suryavanshi takes Challenge from Sampath Nandi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs