Advertisement
Google Ads BL

‘ఒరేయ్‌ బుజ్జిగా’ మరో సాంగ్ వదిలారు


క‌ల‌లు చూసినా క‌న్నులే  నేడు మోసెనే క‌న్నీల్లే.. అంటూ సిద్ శ్రీ‌రామ్ పాట‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న‌ రాజ్‌ తరుణ్ ‘ఒరేయ్‌ బుజ్జిగా’
యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’... ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి ‘క‌ల‌లు చూసినా క‌న్నులే’ లిరికిల్ సాంగ్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

Advertisement
CJ Advs

క‌ల‌లు చూసినా క‌న్నులే  నేడు మోసెనే క‌న్నీల్లే... హాయి పంచినా గుండెకే  ఓ గాయ‌మ‌య్యెనే.. ఓహో జంట న‌డిచినా అడుగులే ఒంట‌ర‌య్య‌నే ఇవ్వాలే.. వెలుగు నిచ్చినా నీడ‌కే  మిగిలింది చీక‌టే.. అంటూ అర్ద‌వంతంగా మ‌న‌సుకు హ‌త్తుకునే ఈ  విర‌హ‌గీతాన్ని కాస‌ర్ల శ్యామ్ రాయ‌గా లేటెస్ట్ సింగింగ్ సెన్సేష‌న్ సిద్ శ్రీ‌రామ్ అంతే అద్భుతంగా ఆల‌పించారు. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ మ్యాజిక‌ల్ ట్యూన్స్  పాట‌ను మ‌రో రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఈ పాట విడుద‌లైన కొద్ది సేప‌టికే సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా ఈ చిత్రంలోని పాటలు  విడులదవుతున్నాయి.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Orey Bujjigaa movie One more lyrical song Released:

Sid Sriram song Released from Orey Bujjigaa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs