రానా దగ్గుబాటి హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన డైరెక్టర్ తేజ, ఆ తర్వాత కాజల్ తో తీసిన సీత సినిమా ద్వారా మళ్లీ పట్టాలు తప్పాడు. ప్రస్తుతం తేజ రెండు సినిమాలని ప్రకటించాడు. రానా హీరోగా తెరకెక్కించాలనుకుంటున్న రాక్షసరాజ్యంలో రావణాసురుడు ఒకటి కాగా, అలివేలుమంగ వెంకటరమణ మరొకటి. అయితే అలివేలు మంగ సినిమాలో గోపీచంద్ హీరోగా కనిపించనున్నాడట.
సీత సినిమాలో లాగా అలివేలు మంగ వెంకటరమణ సినిమాలో హీరోయిన్ పాత్ర బలంగా ఉండనుందట. అందువల్ల అలివేలు మంగగా ఎవరు నటించనున్నారనేది ఆసక్తిగా మారింది. మొదట్లో కాజల్ నటిస్తుందని అన్నారు. అయితే కాజల్ తన కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడం వల్ల ఆమె స్థానంలో అనుష్క శెట్టిని తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. ప్రస్తుత సమాచారం ప్రకారం వీరిద్దరినీ కాకుండా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ని తీసుకోవాలని చూస్తున్నారు.
మహానటి తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపిస్తున్న కీర్తిసురేష్, హీరోయిన్ పాత్రకి ఉన్న ప్రాధాన్యం వల్ల ఈ సినిమాని ఒప్పుకుంటుందని అనుకుంటున్నారు. మరి మహానటి హీరోయిన్ గోపీచంద్ సరసన చేయడానికి సిద్ధమేనా అనేది తెలియాలి.. కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుందట.