యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో చూసే ప్రతీ ఒక్కరికీ ఆమె పరిచయమే. యాంకరింగ్ చేస్తూ, అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించే అనసూయకి నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం రంగస్థలం. రంగమ్మత్తగా ఆమె పర్ ఫార్మెన్స్ కి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. అయితే తాజాగా సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో అనసూయ ఓ ప్రధాన పాత్రలో కనిపించనుందని వార్తలు వచ్చాయి.
నిజానికి ముందుగా ఈ పాత్రని చేయడానికి సీనియర్ హీరోయిన్ ఇంద్రజని అడిగారట. ముందుగా ఇంద్రజ, ఆ పాత్రలో చేయడానికి ఒప్పుకున్నప్పటికీ కరోనా కారణంగా ఇంద్రజ ఆ సినిమా నుండి తప్పుకుందట. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో అనసూయని తీసుకున్నారని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఆమె సుమంత్ అశ్విన్ కి అమ్మగా నటించనుందట. ప్రస్తుతం ఈ వార్త సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ పాత్ర అమ్మ పాత్రేనా లేదా సినిమాలో మరో కీలక పాత్రా అనేది తెలియాలి. ఈ విషయమై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.