Advertisement
Google Ads BL

నిజంగా ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే!


రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఉత్సుకత. అన్ని వర్గాల ప్రేక్షకులను కలిపి ఎంటర్‌టైన్ చెయ్యగల సత్తా రాజమౌళికి ఉంది. అందుకే ఆయన సినిమాలకు అంతమంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఇప్పుడు రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి సినిమా చేస్తున్నాడు. అంటే ఇద్దరి స్టార్స్ అభిమానులను రాజమౌళి ఒకేలా శాటిస్ ‌ఫై చెయ్యాల్సి ఉంటుంది. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అన్నది అభిమానులకు రుచించదు. ఇకపోతే కరోనా లాక్‌డౌన్ లేకపోతె ఈపాటికి RRR సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేది. కానీ కరోనా లాక్‌డౌన్‌తో RRR ప్లాన్స్ మొత్తం కొలాప్స్ అయ్యాయి. తాజాగా రాజమౌళి కరోనా కారణంగా హైదరాబాద్‌ని వదిలేశాడనే టాక్ ఉంది. హైదరాబాద్ నుండి రాజమౌళి ఫ్యామిలీతో సహా తన ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యారని చెబుతున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు RRR ఫ్యాన్స్ ఫుల్‌గా డిజప్పాయింట్ అయ్యే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే కరోనా కారణంగా షూటింగ్ చేయాల్సిన 30 శాతం చిత్రీకరణకు చాలా టైమ్ పట్టేలా ఉంది అని.. ప్రస్తుతం హీరోలు కూడా RRR షూటింగ్ కి అందుబాటులోకి రావడం లేదు, అలాగే సినిమాని ఎలాగైనా త్వరగా ఫినిష్ చేసే ఆలోచనలో రాజమౌళి RRR సాంగ్స్ ని కుదించబోతున్నట్టుగా ఫిలింనగర్ టాక్. RRR కథ తయారైనప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ కి కలిపి మొత్తంగా పదిపాటల వరకు ప్లాన్ చేసిందట చిత్రబృందం. అయితే ఇప్పుడు అందులో కొన్ని పాటలను లేపేసి.. మిగతా షూటింగ్ పూర్తి చేయాలనీ భావిస్తున్నాడట రాజమౌళి. మరి ఎన్టీఆర్ - రామ్ చరణ్‌లకు కలిపి ఎన్ని సాంగ్స్ ప్లాన్ చేసాడో? అందులో ఎవరెవరి సాంగ్స్ లేపేస్తాడో రాజమౌళి అంటూ ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు బెంగపెట్టేసుకుంటున్నారు. 

Bad News to RRR Fans:

Three Songs of RRR Not to Be Shot?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs