ఇది ఫుల్లీ రొమాంటిక్ ‘డర్టీ హరి’
ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాత ఎం.ఎస్.రాజు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ట్రెండీ ఫిల్మ్ ‘డర్టీ హరి’. ఈ చిత్రాన్ని ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మించారు. ‘డర్టీ హరి’లో శ్రవణ్ రెడ్డి హీరో. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ నాయికలు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు.
బ్లాక్ బస్టర్ రికార్డులను క్రియేట్ చేసిన ఎం.ఎస్.రాజు చిత్రాలు.. ‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటివన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘డర్టీ హరి’ మరో ఎత్తు. రొటీన్ కథలకు స్వస్తి చెప్పి.. నేటి యూత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన తెరకెక్కించిన సినిమా ‘డర్టీ హరి’. మన నిత్యం కలిసే మనుషుల్లో దాగి ఉండే ఆటవికత్వం, విచక్షణారాహిత్యం వంటి అంశాల చుట్టూ కథ నడుస్తుంది. కఠోరమైన వాస్తవాలను అంతే సున్నితంగా తెరకెక్కించారు ఎం.ఎస్.రాజు. ఓ వైపు విషయాన్ని చెబుతూనే కథలో వినోదాన్ని కూడా అద్భుతంగా మేళవించారు.
నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మాట్లాడుతూ.. ‘‘మా ‘డర్టీ హరి’ నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. రెండు నెలల లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడు... విడుదలకి సిద్దంగా ఉంది. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. త్వరలో మా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నాం’’ అని అన్నారు.
నటీనటులు:
శ్రవణ్ రెడ్డి ,సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ, రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
సంగీతం: మార్క్ కే రాబిన్
ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్
డీఓపీ: ఎం.ఎన్ .బాల్ రెడ్డి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖి
సమర్పణ: గూడూరు శివరామకృష్ణ,
నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.