Advertisement
Google Ads BL

రాజమౌళి.. హైదరాబాద్‌ను వదిలేశాడా?


ప్రస్తుతం వేరే రాష్ట్రాల ప్రజలంతా హైదరాబాద్‌ని వీడుతున్నారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం, అనేక ప్రాంతాలు హై రిస్క్ జోన్స్‌గా ప్రకటించడం, అలాగే లాక్‌డౌన్ తో ఉపాధి కోల్పోయిన వారు.. వర్క్ ఫ్రొం హోమ్ అంటూ చాలామంది హైదరాబాద్‌ని వదిలి సొంతూళ్లకు వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో కేసులు రోజురోజుకి పెరగడం, అలాగే అక్కడ ఉపాధి లేక ఆకలితో అలమటించేకన్నా సొంతూళ్ళకి వెళ్లి వ్యవసాయం చేసుకోవడం బెటర్ అనుకున్నవారు హైదరాబాద్‌ని వదిలేశారు. ఇప్పటికే భాగ్యనగరం చాలావరకు ఖాళీ అయ్యి.. ఎక్కడ చూసినా టూ లెట్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. తాజాగా టాప్ డైరెక్టర్ రాజమౌళి కూడా RRR పనులు అన్ని పక్కనబెట్టి హైదరాబాద్‌ని వదిలిపెట్టినట్టుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

బాహుబలి టైం‌లో ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఫామ్ హౌస్‌కి రాజమౌళి షిఫ్ట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. రాజమౌళి నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి సమీపంలోని ఎదులూరు గ్రామంలో... పొలంలో తనకి నచ్చినట్టుగా విశాలమైన ఫాంహౌస్‌ను కట్టుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ తో షూటింగ్స్ అన్ని వాయిదా పడడం, ప్రస్తుతం హైదరాబాదులో ఉండడం అంత సేఫ్ కాదనుకున్న రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అవడమే కాదు.. రాజమౌళి అక్కడ వ్యవసాయం కూడా చేయబోతున్నాడట. ఇప్పటికే బాలీవుడ్ సల్మాన్ ఖాన్.. ముంబైలోని తన పొలంలో వరి నాట్లు వేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంటే.. ఇప్పుడు రాజమౌళి కూడా పొల్యూషన్ కానీ, వైరస్ కానీ లేని ప్రాంతానికి వెళ్లి అక్కడ వ్యవసాయం చేసుకోబోతున్నాడట. మరి టాప్ సెలెబ్రిటీనే ఇలా చేస్తే.. చిన్న చిన్న వాళ్ళు హైదరాబాద్‌ని వదిలేయడంలో పెద్ద వింతేముందని అంటున్నారు.

Director SS Rajamouli shifts to farmhouse:

Rajamouli And Family Shifting Into Farm House at Eduluru 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs