Advertisement
Google Ads BL

‘సెబాస్టియ‌న్ P.C. 524’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌


స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ చేతుల మీదుగా యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం ‘సెబాస్టియ‌న్ P.C. 524’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

Advertisement
CJ Advs

‘రాజావారు రాణిగారు’ చిత్రంతో చిత్ర సీమ‌కు ఎంట్రీ ఇచ్చి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో క‌మిట్ అవుతూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం. ఇప్ప‌టికే కిర‌ణ్ త‌న రెండో సినిమాగా ‘ఎస్‌ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం Est. 1975’లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను నిర్మిస్తున్న ఎలైట్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ వారితోనే  తాజాగా ‘సెబాస్టియ‌న్ పి.సి 524’ అనే ప్రాజెక్ట్ లో న‌టించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ కాంబినేష‌న్ లో మ‌రో వినూత్న‌మైన సినిమా రెడీ అవుతుంది. ఈ సినిమాకి నిర్మాత‌లు ప్ర‌మోద్, రాజులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాలాజీ సయ్యపురెడ్డి ఈ సినిమాతో ద‌ర్శ‌కునిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచ‌యం అవుత‌ున్నారు. ఇది ఇలా ఉంటే కిర‌ణ్ అబ్బ‌వరం పుట్టిన రోజు(జూలై 15న‌) సంద‌ర్భంగా ‘సెబాస్టియ‌న్ పి.సి. 524’ ఫ‌స్ట్ లుక్‌ని రెడీ చేసింది చిత్ర బృందం. స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ఈ ఫ‌స్ట్ లుక్‌ని ఆన్‌లైన్‌లో విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం పోలీస్ కాన్సిస్టేబుల్‌గా న‌టిస్తున్నారు. ఇదే థీమ్‌తో ఫ‌స్ట్ లుక్‌ని సైతం చిత్ర బృందం సిద్ధం చేసింది. అలానే ఈ సినిమాలో హీరో రే చీక‌టి (నైట్ బ్లైండ్ నెస్ తో) బాధ‌ప‌డుతుంటాడ‌నే వివ‌రాన్ని కూడా ఫ‌స్ట్ లుక్ ద్వారా తెలియ‌జేశారు. ఇక ఈ సినిమాకి ఎడిట‌ర్‌గా విప్ల‌వ్, సినిమాటోగ్రాఫ‌ర్ రాజ్ కే న‌ల్లి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సెబాస్టియ‌న్ కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు, త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌మోద్, రాజులు తెలిపారు.

తారాగ‌ణం

కిర‌ణ్ అబ్బ‌వ‌రం

సాంకేతిక వ‌ర్గం

బ్యాన‌ర్: ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత‌లు: ప్ర‌మోద్ - రాజు

కెమెరా: రాజ్ కే న‌ల్లి

ఎడిట‌ర్: విప్ల‌వ్ నైశా‌దం

పీఆర్ఓ: ఏలూరు శ్రీను

డైరెక్ట‌ర్: బాలాజీ సయ్యపురెడ్డి

Kiran Abbavaram Sebastian P.C 524 First Look Released:

Star director Harish Shankar launches the first look poster of talented hero Kiran Abbavaram Sebastian P.C 524
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs