Advertisement
Google Ads BL

ఏ ఆర్ రెహమాన్ కోసం ప్రభాస్ ప్రయత్నం..!


ప్రభాస్ 20వ చిత్రమైన రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ సినిమాపై అనేక కథనాలు వస్తున్నాయి. బాహుబలి బిగినింగ్ రిలీజ్ తేదీన ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన చిత్రబృందం, సినిమాలో నటించే నటీనటుల పేర్లతో పాటు సాంకేతిక నిపుణులని పేర్లని బయట పెట్టింది. కానీ రాధేశ్యామ్ కి సంగీతం అందించేది ఎవరనే దానిపై సస్పెన్స్ అలాగే ఉంది. అందరి పేర్లని ప్రకటించి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది హోల్డ్ లో పెట్టింది.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరు చేస్తున్నారనే విషయమై ఇప్పటికే చాలా రూమర్లు వచ్చాయి. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ పేరు వినిపించింది.  ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రానికి స్వరాలని సమకూర్చాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంగీతం అందించేందుకు ఏ ఆర్ రెహమాన్ ని తీసుకురానున్నారట.

భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ అందుకున్న దిగ్గజ దర్శకుడిచే రాధేశ్యామ్ చిత్రానికి సంగీతం చేయించాలని చూస్తున్నారట. ఈ మేరకు ప్రభాస్ ప్రయత్నాలు జరుపుతున్నాడని టాక్. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ చిత్రానికి ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ చేస్తే మరో రేంజ్ లో ఉంటుందని తెలిసిందే. మరి ప్రభాస్ ప్రయత్నాలు ఫలించి ఏ ఆర్ రహమాన్ వస్తాడేమో చూడాలి.

Prabhas Radheshyam music director is..?:

Prabhas Radheshyam music director is..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs