Advertisement
Google Ads BL

ఇక నాగబాబే డైరెక్ట్‌గా రంగంలోకి దిగుతున్నాడు


నాగబాబు జబర్దస్త్‌లో ఏడేళ్లు జడ్జ్‌గా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించాడు. కానీ నాగబాబు జబర్దస్త్ మీద కోపం, తనకి బాగా కావాల్సిన వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక జీ ఛానల్‌తో మాట్లాడి.. జబర్దస్త్ మాజీ డైరెక్టర్స్ తో అదిరింది షో ప్లాన్ చేయించాడు. తనతో పాటు జబర్దస్త్ టీం లను అదిరింది షో కి లాగేసి జబర్దస్త్ షో ని పడేసేలా అదిరింది షోని సక్సెస్ చెయ్యాలని చూసి ఘోరంగా దెబ్బతిన్నాడు. రోజా జడ్జ్‌గా జబర్దస్త్ షో ఎప్పటిలాగే జబర్దస్త్ గా నడవడం, అదిరింది షో అడుగడుగునా విఫలమవడంతో ఇప్పుడు నాగబాబు ఓ ప్లాన్ చేసాడట. అది కూడా తన సొంతగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కామెడీ షోని ప్లాన్ చేస్తున్నాడట.

Advertisement
CJ Advs

తన యూట్యూబ్ ఛానల్ లో ఓ కామెడీ షో చెయ్యాలని, మన ఛాన‌ల్ మ‌న ఇష్టం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త కమెడియన్స్ ని తీసుకోవాలని, అలాగే జబర్దస్త్, అదిరింది షోలో చేసే టాప్ కమెడియన్స్ ని, టీం లీడర్స్ ని లాగేసి.. జబర్దస్త్, అదిరింది షోలకి ధీటుగా తన మన ఛాన‌ల్ మ‌న ఇష్టం అనే ఛానల్ ద్వారా కామెడీ షోని ప్లాన్ చేస్తున్నాడట. చెయ్యడమే కాదు.. ఇప్పటికే ఎంట్రీల‌ను కూడా ఆహ్వానిస్తున్నాడట నాగబాబు. ఇక నాగబాబు ఒక్కటి కాదు రెండు కామెడీ షోస్ ని ప్లాన్ చేసుకుంటున్నాడట. రెండు షోస్ ని యూట్యూబ్ ఛానల్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు తెస్తాడట. మరి నాగబాబు అదిరింది, జబర్దస్త్ లను కొట్టేసి కామెడీ పరంగా సక్సెస్ అయ్యే ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Nagababu plans two Comedy shows in his Own Youtube Channel:

Mega Brother Nagababu Direct Attack
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs